Christmas 2024: ఈ క్రిస్మస్‌కు ఇంటికి వెళ్లలేకపోతున్నారా..? ఫ్యామిలీని మిస్ అవకుండా ఉండాలంటే ఇలా సెలబ్రేట్ చేసుకోండి
22 December 2024, 14:35 IST
- Christmas 2024: క్రిస్మస్ అంటేనే కుటుంబ సభ్యులు, ఆత్మీయులు కలిసి జరుపుకునే పండుగ. కానీ చదువులు,ఉద్యోగాల రీత్యా కుటుంబానికి దూరంగా ఉంటున్న కొందరికి పండగకు ఇంటికి వెళ్లడం కుదరకపోవచ్చు. అలాంటి వారు ఫ్యామిలీని మిస్ అవకుండా పండుగను సంతోషంగా జరుపుకునే చక్కటి మార్గాలున్నాయి. అవేంటో చూసేద్దాం రండి
ఈ క్రిస్మస్‌కు ఇంటికి వెళ్లలేకపోతున్నారా..? ఫ్యామిలీని మిస్ అవకుండా ఉండాలంటే ఇలా సెలబ్రేట్ చేసుకోండి
క్రిస్మస్ అంటేనే కుటుంబ సభ్యులు, ఆత్మీయులు అంతా కలిసి ఒక చోట చేరి సంతోషంగా జరుపుకునే పండుగ. కానీ చదువులు,ఉద్యోగాల రీత్యా కుటుంబానికి దూరంగా ఉంటున్న కొందరికి పండగకు ఇంటికి వెళ్లడం కుదరకపోవచ్చు. ఇందుకు సెలవులు దొరకపోవడం, వీలు కాకపోవడం వంటి పలు కారణాలు ఉండి ఉంటాయి. అలాంటప్పుడు ఒంటరిగా పండుగను జరుపుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఫ్యామిలీని చాలా మిస్ అవ్వాల్సి వస్తుంది. పండగ అంటే ఆసక్తి ఉండదు. నిజానికి పండగ ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తుంది కనుక ఆ రోజు తప్పనిసరిగా సంతోషంగా జరుపుకోవాలి. ఇంటికి దూరంగా ఉన్న వాళ్లు కూడా సంతోషంగా క్రిస్మస్ వేడుకను జరుపుకునేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. వీటి ద్వారా మీరు ఒంటరిగా ఉన్నా కూడా క్రిస్మస్ పండుగ ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు. క్రిస్మస్ రోజున ఫ్యామిలీని మిస్ అవకుండా ఉండాలంటే ఏమేం చేయాలో తెలుసుకుందాం.
1. ఆన్‌లైన్ కనెక్టివిటీ :
కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉండే వారికి ఒకప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు టెక్నాలజీ ఈ దూరాన్ని తగ్గించుకునేందుకు సహాయపడుతుంది. క్రిస్మస్ పండుగ రోజున మీరు ఒంటరిగా ఉండకుండా మీ కుటుంబానికి వీడియో కాల్ చేయచ్చు. ఫోన్లో వాళ్లు మీరూ కలిసి పండుగను జరుపుకోవచ్చు. సరదాగా పాటలు పాడుకోవచ్చు, ఆటలు ఆడుకోవచ్చు. కుటుంబంతో కలిసి ఒకేసారి భోజనం కూడా చేయచ్చు, ఆనందాన్ని పంచుకోవచ్చు. వారికి నచ్చిన బహుమతులను ఇంటికి పంపించవచ్చు
2. "ఫ్రెండ్స్ గివింగ్"
క్రిస్మస్ అంటే కేవలం కుటుంబంతో మాత్రమే జరుపుకునే పండుగ కాదు. ఆత్మీయులు, సన్నిహితులతో కూడా సరదాగా పండుగను సెలబ్రేట్ చేసుకోవచ్చు. క్రిస్మస్ రోజున మీ కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉన్నట్లయితే ఇరుగు, పొరుగు వారు లేదా స్నేహితులతో కలిసి పండుగను జరుపుకోవచ్చు. వారితో కలిసి డిన్నర్ చేయడం, గిఫ్ట్ ఎక్స్ఛేంజ్ చేయడం, క్రిస్మస్ ట్రీ అలంకరించడం, సినిమాలు చూడడం వంటివి చేసి పండుగను సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు.సీక్రెట్ సాంటా గేమ్ తో అందరూ సరదాగా సమయాన్ని గడపచ్చు.
3. మీ ఇంటిని అలంకరించండి
క్రిస్మస్ రోజున మీరు సొంత ఇంటికి వెళ్లలేకపోతే.. మీరు ఎక్కడ ఉన్నా, ఇంటిని అలంకరించడం అనేది క్రిస్మస్ పండుగ వాతావారణాన్ని తీసుకురావడంలో కీలకమైనది. చిన్నదైనా సరే ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టుకోవడం, గూస్తకాలు ఎంచుకోవడం లేదా లైట్లు, పువ్వులతో ఇంటిని, క్రిస్మస్ ట్రీని అలంకరించుకోవడం మీకు సంతోషాన్నిస్తుంది. కుటుంబంతో కలిసి చేసే ప్రత్యేక అలంకరణలు లేదా చారిత్రక అలంకరణలను కూడా మీరు ఉంటున్న ఇంటిలో కూడా చేసుకోవచ్చు. ఇది మీకు కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తుంది.
4. గిఫ్ట్‌లు, క్రిస్మస్ కార్డులు పంపండి
మీరు కుటుంబంతో ఉండలేకపోయినా వారికి ప్రత్యేకమైన గిఫ్ట్‌లు పంపడం వారి కోసం మీ ప్రేమను వ్యక్తం చేసే ఒక అద్భుతమైన మార్గం. అనుభవాలను గుర్తు చేసే లేదా వ్యక్తిగతంగా రూపొందించిన గిఫ్ట్‌లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మీరు పంపే ఒక హృదయపూర్వక క్రిస్మస్ కార్డ్ కూడా మీ ప్రేమను పంచే ఒక అద్భుతమైన మార్గం. ఆత్మీయమైన జ్ఞాపకాలను లేఖ రూపంలో రాసి పంపేందుకు ఇది చక్కటి అవకాశం.
5. అనాథలకు సహాయం చేయండి
క్రిస్మస్ పండుగ ప్రేమ, దయ, మానవత్వం వ్యక్తపరిచేందుకు చక్కటి సమయం. కుటంబంతో కలిసి పండుగను జరుపుకోలేని వారి స్థానిక ఆశ్రమం లేదా వితరణ కేంద్రాల్లో సేవా కార్యక్రమాలు, ఆర్థిక సహాయం వంటివి చేయచ్చు. లేదంటే ఇతర సేవా సంస్థలలో వాలంటీర్ చేయవచ్చు. మీ ప్రేమను సమాజానికి పంచి వారితో సంతోషంగా గడపచ్చు. ఇలా మీరు చేసే అతి చిన్న సహాయం కూడా చాలా గౌరవాలను తెచ్చి పెడుతుంది. పేదవారికి, కనీస అవసరాలు లేని వారికి సహాయం చేయవచ్చు.
6. కొత్త క్రిస్మస్ సంప్రదాయాలను సృష్టించండి
కుటుంబంతో ఉన్నప్పుడు మీరు పాటించే క్రిస్మస్ సంప్రదాయాలను గుర్తుంచుకోండి, అలాగే కొత్త సంప్రదాయాలు సృష్టించడం కూడా ఒక ప్రత్యేక అనుభవంగా అవుతుంది. ఉదాహరణకు, మీరు ఒక మంచి క్రిస్మస్ కుకీస్ వంటకం తయారు చేయడం, క్రిస్మస్ సినిమాలను చూడడం లేదా నాటకం వ్రాయడం.ఇంటిని క్రిస్మస్ సంగీతంతో నింపచ్చు. గత సంవత్సరం ఎలా గడిపారు, ఏం నేర్చుకున్నారో, ఏం సాధించారో క్షణం వేచి చూసి, ఆ కృతజ్ఞతను వ్యక్తం చేసుకోవచ్చు.