తెలుగు న్యూస్  /  Lifestyle  /  Are You Always Feeling Tired Ok Thats Not A Big Problem Follow These Tips Top Overcome

ఏమి పని చేసినా త్వరగా అలసిపోతున్నారా? అయితే ఇలా రీఛార్జ్ అయిపోండి..

HT Telugu Desk HT Telugu

23 April 2022, 12:29 IST

    • మారిన జీవనశైలి, ఒత్తిడి, హడావిడి, మానసిక అసౌకర్యం వంటి అనేక కారణాల వల్ల తరచుగా అలసట కనిపిస్తుంది. పని చేయాలని అనిపించదు. ఒకవేళ పనిచేయాల్సి వచ్చినా.. ఫ్రెష్ గా, ఎనర్జిటిక్​గా అనిపించదు. మీరు కూడా అదే పరిస్థితిలో ఉంటే.. చింతించకండి. ఈ చిట్కాలను ఫాలో అయిపోయి.. మిమ్మల్ని మీరే రీఛార్జ్ చేసుకోండి.
అలసటను ఇలా వదిలేయండి..
అలసటను ఇలా వదిలేయండి..

అలసటను ఇలా వదిలేయండి..

Feeling Exhausted | ఏ పని చేసిన త్వరగా అలసిపోతున్నారా? అలసటతో అన్ని వేళలా పడుకోవాలని అనిపిస్తుందా? ఖాళీగా కుర్చున్న సరే అలసిపోయినట్లు అనిపిస్తుందా? ఈ లక్షణాలు మీ ఒక్కరికే ఉన్నాయని భయపడకండి. చాలా మంది ఈ ఇబ్బందులను అనుభవిస్తున్నారు. మరి ఈ సమస్యను ఎలా అధిగమించాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే. అలసటను జయించడానికి ఈ చిట్కాలను మీరు పాటించండి. అలసటకు టాటా చెప్పేయండి.

సరైన నిద్ర..

ముందుగా నిద్ర నాణ్యతపై శ్రద్ధ వహించండి. శరీరానికి కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం. నిద్రపోయే ముందు శరీరాన్ని స్ట్రెచ్​ చేయండి. అంతేకాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. పడుకోవడానికి గంట ముందు స్క్రీన్ వైపు చూడకుండా ఉండటం మంచిది.

మానసిక ప్రశాంతత..

మానసిక ఒత్తిడితో మీ శరీరం త్వరగా అలసిపోతుంది. కాబట్టి మీ మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీ మనసు, శరీరాన్ని విశ్రాంతి ఉంచడానికి ధ్యానం లేదా వ్యాయామం చేయండి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో, మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. రోజులో ఒక నిర్దిష్ట సమయంలో చదువుకోండి. ఆ సమయంలో మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.

ఇంట్రోవర్టా?

మీరు ఎక్కువ మాట్లాడరా? ఎవరినైనా కలవడం అంటే మీకు నచ్చదా? అయితే మిమ్మల్ని మీరు రీఛార్చ్ చేసుకోండి. ఆ సమయంలో మీరు మీ అభిరుచులను కొనాగించండి. మీకు నచ్చిన పని చేసి.. మీ మనసును రీఛార్జ్ చేసుకోండి. మీ హాబీల కోసం వారానికి కొన్ని గంటలు కేటాయించండి. అది ఏదైనా కావచ్చు - పాడటం, నృత్యం, పెయింటింగ్ లేదా తోటపని ఏదైనా పర్లేదు. మీకు ఇష్టమైన పని చేస్తే మనసుకు హాయిగా ఉంటుంది. అలసటగా కూడా అనిపించదు.

విహారయాత్రకు వెళ్లండి..

విహారయాత్రకు వెళ్లడం మర్చిపోవద్దు. ప్రయాణం మీ మనసును రిఫ్రెష్ చేస్తుంది. మీలో కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లండి. లేదా ఒంటరిగా వెళ్లండి.

టాపిక్