తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే మీ ఫోన్‌ను ఈజీగా ఆపరేట్ చేయొచ్చు!

ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే మీ ఫోన్‌ను ఈజీగా ఆపరేట్ చేయొచ్చు!

HT Telugu Desk HT Telugu

18 June 2022, 22:32 IST

    • ఇప్పుడు చాలా వరకు మెుబైల్ కంపెనీలు 6.5 అంగుళాల స్క్రీన్‌తో ఫోన్స్‌ను విడుదల చేస్తున్నాయి. ఇంత పెద్ద ఫోన్‌ని ఒక చేత్తో ఆపరేట్ చేయడం చాలా కష్టం. అయితే చిన్న ట్రిక్ ద్వారా ఒక చేత్తో కూడా ఫోన్ కీ బోర్డును టైప్ చేయవచ్చు.
Mobiles Phones
Mobiles Phones

Mobiles Phones

చాలా వరకు వివిధ ఫోన్ బ్రాండ్స్‌కు సంబంధించిన మెుబైల్స్ పరిమాణం చాలా పెద్దదిగా ఉంటుంది. ఇప్పుడు చాలా కంపెనీలు 6.5 అంగుళాలతో పెద్ద స్క్రీన్ ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. ఇంత పెద్ద ఫోన్లను ఒక చేత్తో ఆపరేట్ చేయడం చాలా  కష్టంగా ఉంటుంది. ఏదైనా వీడియోను చూడలన్నా.. ఆర్టికల్ చదవాలన్నా లేదా చాటింగ్ చేయలన్నా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో చిన్న ట్రిక్ ద్వారా ఎంత పెద్ద ఫోన్ అయిన సులువుగా ఒంటి చెత్తో టైప్ చేయవచ్చు . దీని కోసం ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో ప్లే స్టోర్ నుండి GBoard అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీంతో ఈ యాప్ కీబోర్డ్ ద్వారా సులువుగా మీ పోన్‌ను ఆపరెట్ చేయవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Evening Walk Benefits : వేసవిలో సాయంత్రంపూట నడవండి.. ఆరోగ్య ప్రయోజనాలు పొందండి

Drumstick Chicken Gravy: మునక్కాడలు చికెన్ గ్రేవీ ఇలా చేసి చూడండి, ఆంధ్ర స్టైల్‌లో అదిరిపోతుంది

Bapatla Beach Tour : బాపట్ల టూర్.. తెలంగాణ వాళ్లు బీచ్ చూడాలనుకుంటే.. ఈ ఆప్షన్ బెస్ట్

Besan Laddu Recipe: శనగ పిండితో తొక్కుడు లడ్డూ ఇలా ఇంట్లోనే చేయండి, నెయ్యితో చేస్తే రుచి సూపర్

 డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఫోన్‌లో Gboard  కీబోర్డ్‌ను డిఫాల్ట్‌గా ఎంచుకోండి.

దీని కోసం, మీరు మీ ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి కీబోర్డ్‌ను  సెర్చ్ చేసి డిఫాల్ట్ కీబోర్డ్‌ని ఎంచుకోవాలి.

ఇప్పుడు ఏదైనా చాట్‌ని తెరిచి, కీబోర్డ్‌ని ఓపెన్ చేయండి.

-తర్వాత కీబోర్డ్‌లోని కామా (,)ని కొద్దిసేపు నొక్కి పట్టుకోండి.

ఇక్కడ మీకు ఎమోజీ, సెట్టింగ్‌, వన్ హ్యాండ్ మోడ్ అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. తర్వాత థర్డ్ ఆప్షన్‌కు వెళ్లండి.

- ఇలా చేయడం వల్ల కీబోర్డ్ పరిమాణంలో చిన్నదిగా మారుతుంది. దీంతో ఒక చేత్తో సులభంగా టైపింగ్ చేయవచ్చు.

మీకు కావాలంటే, మీరు దాని స్థానాన్ని కూడా  మార్చుకోవచ్చు.