తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Aiims Guwahati Recruitment: ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా!

AIIMS Guwahati Recruitment: ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా!

HT Telugu Desk HT Telugu

22 September 2022, 14:26 IST

    • ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) గౌహతి పలు ఉద్యోగాల భర్తీకి ఆసక్తిగా ఉన్న అభ్యర్థుల నుండి  దరఖాస్తులను కొరుతుంది. దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 2.
AIIMS Guwahati Recruitment
AIIMS Guwahati Recruitment

AIIMS Guwahati Recruitment

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) గౌహతిలో డిప్లాయ్‌మెంట్‌లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు becil.comలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 2.

ట్రెండింగ్ వార్తలు

Green Chilli Water Benefits : పచ్చిమిర్చి నానబెట్టిన నీరు తాగండి.. శరీరంలో ఈ అద్భుత మార్పులు చూడండి

Chanakya Niti Telugu : ఈ గుణాలు ఉన్న స్త్రీని పెళ్లి చేసుకున్న మగవాడు అదృష్టవంతుడు

Asthma: పాల ఉత్పత్తులు అధికంగా తింటే ఆస్తమా సమస్య పెరుగుతుందా?

Korrala Pongali: బ్రేక్ ఫాస్ట్‌లో కొర్రల పొంగలి వండుకోండి, డయాబెటిస్ ఉన్న వారికి ఇది బెస్ట్ అల్పాహారం

పోస్ట్‌ల వివరాలు:

రేడియోలాజికల్ సేఫ్టీ ఆఫీసర్ (మెడికల్ ఫిజిసిస్ట్): 1 పోస్ట్

లైబ్రేరియన్ గ్రేడ్-III: 1 పోస్ట్

స్టాఫ్ నర్స్: 4 పోస్టులు

రేడియోలాజికల్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. మెడికల్ ఫిజిక్స్‌లో MSc లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి సమానమైన డిగ్రిని కలిగి ఉండాలి లేదా రేడియోలాజికల్ మెడికల్ ఫిజిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా/డిగ్రీతో పాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఫిజిక్స్‌లో ఎంఎస్సీ చేసి ఉండాలి.

వయోపరిమితి: 18 నుండి 40 సంవత్సరాలు

జీతం: రూ. 34,612

లైబ్రేరియన్ పోస్ట్ కోసం, గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి లైబ్రరీ సైన్స్‌లో BSc డిగ్రీ లేదా తత్సమానం మరియు/లేదా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమానం అవసరం.

మెడికల్ లైబ్రరీలో పుస్తకాలు, ఓరియోడికల్స్ మరియు డాక్యుమెంటేషన్ పనిలో 2 సంవత్సరాల అనుభవం మరియు ఆంగ్లంలో 30 WPM లేదా హిందీలో 25 WPM టైపింగ్ స్పీడ్ ఉన్న అభ్యర్థులు కోరదగినది.

వయోపరిమితి: 18 నుండి 45 సంవత్సరాలు

జీతం: రూ. 33,481

స్టాఫ్ నర్స్ పోస్టులకు, ఆక్సిలరీ నర్స్ మిడ్‌వైఫరీ (ANM) లేదా జనరల్ నర్సింగ్ మరియు మిడ్‌వైఫరీ (GNM) అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన సంస్థ/ఆసుపత్రిలో సంవత్సరం పని అనుభవం అవసరం.

వయోపరిమితి: 18 నుండి 45 సంవత్సరాలు

జీతం: రూ. 19,308