తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Zee Telugu Serials On Sunday: ఇక నుంచి సండే కూడా సీరియల్స్ ప్రసారం- మరో స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!

Zee Telugu Serials On Sunday: ఇక నుంచి సండే కూడా సీరియల్స్ ప్రసారం- మరో స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!

Sanjiv Kumar HT Telugu

22 August 2024, 13:22 IST

google News
  • Zee Telugu Serials On Sunday From This Date: ఇక నుంచి తెలుగు సీరియల్స్ ఆదివారం కూడా ప్రసారం కానున్నాయి. ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్ జీ తెలుగులో పాపులర్ సీరియల్స్‌ని సండే కూడా టెలీకాస్ట్ చేయనున్నారు. ఈ విషయంపై జీ తెలుగు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి మరి ప్రకటించింది.

ఇక నుంచి సండే కూడా సీరియల్స్ ప్రసారం- మరో స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!
ఇక నుంచి సండే కూడా సీరియల్స్ ప్రసారం- మరో స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!

ఇక నుంచి సండే కూడా సీరియల్స్ ప్రసారం- మరో స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!

Telugu Serials On Sunday In Zee Telugu: తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించడంలో ముందుండే జీ తెలుగు మరో సర్​ప్రైజ్​తో ముందుకు వచ్చేస్తోంది. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో విజయవంతంగా కొనసాగుతున్న జీ తెలుగు తెలుగు సీరియల్స్​ని ఇక నుంచి ఆదివారం కూడా అందించేందుకు సిద్ధమైంది.

జీ తెలుగు అధికారిక ప్రకటన

సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారమయ్యే సీరియల్స్​ అన్నింటిని ఇక నుంచి ఆదివారం కూడా ప్రసారం చేసేందుకు రెడీ అయింది జీ తెలుగు ఛానెల్. ఈ పాపులర్ సీరియల్స్ అన్నింటిని ఆగస్ట్ 25 నుంచి ఆదివారం కూడా ప్రసారం చేయనున్నారు. ఈ విషయంపై జీ తెలుగు అధికారికంగా తాజాగా ప్రకటించింది.

మొత్తం ఆరు సీరియల్స్

ఆదివారం ప్రసారమయ్యే సీరియల్స్ ఆరుగా ఉన్నాయి. అవి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి, మా అన్నయ్య, నిండు నూరెళ్ల సావాసం, మేఘసందేశం, పడమటి సంధ్యారాగం, త్రినయని ధారావాహికలు. ఈ సీరియల్స్ ఇకనుంచి ఆదివారం కూడా తమ అభిమానులను అలరిస్తాయి. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సాయంత్రం 6 గంటలకు, మా అన్నయ్య 6:30 గంటలకు టెలీకాస్ట్ చేస్తారు.

నాన్ స్టాప్ సీరియల్ ఎంటర్టైన్‌మెంట్

అలాగే నిండు నూరేళ్ల సావాసం రాత్రి 7 గంటలకు, మేఘసందేశం 7:30 గంటలకు, పడమటి సంధ్యారాగం 8 గంటలకు, త్రినయని 8:30 గంటలకు ప్రసారం కానున్నాయి. ఈ నాన్ స్టాప్ సీరియల్ ఎంటర్​టైన్​మెంట్​ ఈ వారం నుంచే ప్రారంభమవుతోంది. అశేష ప్రేక్షకాభిమానం పొందుతున్న ఈ ఆరు సీరియల్స్ ఇక నుంచి ప్రతిరోజూ ప్రేక్షకులను అలరించనున్నాయి.

హారర్ మూవీ టీవీ ప్రీమియర్

మధ్యాహ్నం సీరియల్స్​ మాత్రం యథాతథంగా సోమవారం నుంచి శనివారం వరకు వాటి వాటి సమయాల్లో ప్రసారమై ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ నాన్ స్టాప్ సీరియల్ ట్రీట్‌తో పాటు ఈ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బ్లాక్ బస్టర్ హిట్ హారర్ మూవీ పిండం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను కూడా అందిస్తోంది జీ తెలుగు.

టీవీలో పిండం మూవీ

థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న హారర్ మూవీ పిండం ఆకట్టుకునే కథ, కథనం, అద్భుతమైన తారాగణంతో బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది. ఈ ఆదివారం నుంచి వారం వారం నాన్​స్టాప్​ సీరియల్స్​తో పాటు సరికొత్త సినిమాలను ఆస్వాదించేందుకు జీ తెలుగు ప్రేక్షకులు సిద్ధంగా ఉండండి అంటూ నిర్వహాకులు తెలిపారు.

సింగింగ్ షోలతోపాటు

ఈ సీరియల్స్, సినిమాలతోపాటు ప్రతిష్టాత్మకంగా రియాలిటీ షోలను సైతం నిర్వహిస్తోంది జీ తెలుగు. ఇప్పటికే ఈ ఛానెల్‌లో కామెడీ, డ్యాన్స్, రియాలిటీ, సింగింగ్ షోలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. త్వరలో సరిగమప సీజన్‌ 16‌- ది నెక్ట్స్ సింగింగ్​ యూత్​ ఐకాన్ షోను కూడా స్టార్ట్ చేయనుంది జీ తెలుగు. ఇందుకోసం హైదరాబాద్‌లో ఆడిషన్స్ కూడా నిర్వహించనున్నారు.

హైదరాబాద్‌లో ఆడిషన్స్

ఆగస్ట్ 25న హైదరాబాద్​లోని హిందూ మహిళా జూనియర్ కళాశాల, హిందూ పబ్లిక్​ స్కూల్​ దగ్గర, గోకుల్​ థియేటర్​ ఎదురుగా, సనత్​ నగర్​లో ఉదయం 9:00 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరిగమప సీజన్​ 16 ఆడిషన్స్​ జరగనున్నాయి. వీటికి 15 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల గాయనీ గాయకులు అర్హులు.

తదుపరి వ్యాసం