తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dhamki Pre Release Business: ధ‌మ్కీ ప్రీ రిలీజ్ బిజినెస్ - నంద‌మూరి హీరోల స‌పోర్ట్ విశ్వ‌క్‌సేన్‌ను గ‌ట్టెక్కిస్తుందా

Dhamki Pre Release Business: ధ‌మ్కీ ప్రీ రిలీజ్ బిజినెస్ - నంద‌మూరి హీరోల స‌పోర్ట్ విశ్వ‌క్‌సేన్‌ను గ‌ట్టెక్కిస్తుందా

21 March 2023, 8:43 IST

  • Dhamki Pre Release Business: ఈ ఉగాదికి ధ‌మ్కీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్‌. అత‌డు హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జ‌రిగిందంటే...

విశ్వ‌క్‌సేన్‌ ధ‌మ్కీ
విశ్వ‌క్‌సేన్‌ ధ‌మ్కీ

విశ్వ‌క్‌సేన్‌ ధ‌మ్కీ

Dhamki Pre Release Business: విశ్వ‌క్‌సేన్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన దాస్ కా ధ‌మ్కీ సినిమా ఉగాది కానుక‌గా మార్చి 22న రిలీజ్ కానుంది. ఫ‌ల‌క్‌నుమా దాస్ త‌ర్వాత విశ్వ‌క్ సేన్ ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల్ని చేప‌ట్టి రూపొందించిన సినిమా ఇది. కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ విశ్వ‌క్‌సేన్ డ్యూయ‌ల్ రోల్‌లో న‌టిస్తోన్న సినిమా కూడా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

ట్రెండింగ్ వార్తలు

Hi Nanna: హాయ్ నాన్న సినిమాకు మరో అంతర్జాతీయ వేదికపై అవార్డుల పంట.. ఆరు పురస్కారాలు: ఏఏ విభాగాల్లో వచ్చాయంటే..

Samantha: ‘అది ఫేక్’: సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమంత ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..

Chitram Choodara OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

ఈ వారం టాలీవుడ్ రిలీజ్‌ల‌లో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాపై ఎక్కువ‌గా హైప్ ఉండ‌టం గ‌మ‌నార్హం. ధ‌మ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ (Ntr) గెస్ట్‌గా రావ‌డంతో బ‌జ్ మ‌రింత పెరిగింది. సినిమాపై ఉన్న పాజిటివ్ టాక్ కార‌ణంగా ధ‌మ్కీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జ‌రిగిన‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్‌సీస్‌లో క‌లిపి ఏడున్న‌ర కోట్ల‌కుపైగా ధ‌మ్కీ సినిమాథియేట్రిక‌ల్ రైట్స్ అమ్ముడుపోయిన‌ట్లు స‌మాచారం.

నైజాం ఏరియాలో మూడు కోట్ల వ‌ర‌కు థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగిన‌ట్లు చెబుతోన్నారు. ఆంధ్రాలో మూడు కోట్లు, సీడెడ్‌లో ఎన‌భై ల‌క్ష‌లు, ఓవ‌ర్‌సీస్‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల్లో క‌లిపి కోటి వ‌ర‌కు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన‌ట్లు స‌మాచారం. ఓవ‌రాల్‌గా ఎనిమిది కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ వ‌స్తేనే డైరెక్ట‌ర్ క‌మ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న విశ్వ‌క్‌సేస్ సేఫ్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం పెద్ద సినిమాల రిలీజ్‌లు లేక‌పోవ‌డంతో ధ‌మ్కీ సినిమాకు భారీగానే థియేట‌ర్లు దొరికిన‌ట్లు చెబుతోన్నారు. అలాగే నంద‌మూరి ఫ్యాన్స్ స‌పోర్ట్ ఉండ‌టం విశ్వ‌క్‌సేన్‌కు క‌లిసిరావ‌చ్చున‌ని చెబుతోన్నారు. ధ‌మ్కీ సినిమాలో నివేథా పేతురాజ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

పాగ‌ల్ త‌ర్వాత విశ్వ‌క్‌సేన్‌, నివేథా పేతురాజ్ జంట‌గా న‌టిస్తోన్న సినిమా ఇది. ఈ సినిమాకు పాగ‌ల్ డైరెక్ట‌ర్ న‌రేష్ కొప్పిలి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల్సింది. కానీ షూటింగ్ మొద‌లుకాక‌ముందే క్రియేటివ్ డిఫ‌రెన్సెస్‌తో అత‌డు త‌ప్పుకోవ‌డంతో విశ్వ‌క్ సేన్ స్వ‌యంగా మెగాఫోన్ ప‌ట్టాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.