Vishwak Sen - Neha Shetty Movie: విశ్వక్‌సేన్‌తో డీజే టిల్లు బ్యూటీ రొమాన్స్
Vishwak Sen - Neha Shetty Movie: డీజే టిల్లు భామ నేహాశెట్టి తెలుగులో మరో బంపరాఫర్‌ను దక్కించుకోన్నట్లు సమాచారం. యంగ్ హీరో విశ్వక్‌సేన్‌తో రొమాన్స్ చేయబోతున్నట్లు తెలిసింది. ఈ సినిమా ఏదంటే...
Vishwak Sen - Neha Shetty Movie: డీజే టిల్లు (DJ Tillu) సినిమాలో రాధిక పాత్రతో యువతరం ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంది నేహాశెట్టి (Neha Shetty). నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేసింది. చిన్న సినిమాల్లో పెద్ద సక్సెస్‌గా నిలిచిన ఈ సినిమా తర్వాత నేహాశెట్టికి టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు వరిస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
యంగ్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు అందుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ విశ్వక్‌సేన్‌తో జోడీకట్టబోతున్నట్లు తెలిసింది. విశ్వక్‌సేన్ హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ సినిమా రూపొందనున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయిన్‌గా నటించబోతున్నట్లు చెబుతున్నారు. నేహాశెట్టితో పాటు మరో కీలక పాత్రలో అంజలి నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తొలుత ఈ సినిమాను శర్వానంద్‌తో ప్రారంభించారు కృష్ణచైతన్య. కానీ డేట్స్ ఇష్యూస్‌తో శర్వానంద్ తప్పుకోవడంతో అతడి స్థానంలో విశ్వక్‌సేన్‌ను హీరోగా తీసుకున్నట్లు సమాచారం.
ఈ నెలాఖరు నుంచి విశ్వక్‌సేన్, కృష్ణచైతన్య సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం తెలుగులో నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న బెదురులంక 2012 సినిమా ఉగాదికి రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తోన్నాడు.
టాపిక్