తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vikram - Trisha: హీరోహీరోయిన్లుగా... అన్నాచెల్లెళ్లుగా న‌టించిన కోలీవుడ్‌ స్టార్‌హీరోహీరోయిన్లు ఎవ‌రో తెలుసా

Vikram - Trisha: హీరోహీరోయిన్లుగా... అన్నాచెల్లెళ్లుగా న‌టించిన కోలీవుడ్‌ స్టార్‌హీరోహీరోయిన్లు ఎవ‌రో తెలుసా

14 March 2024, 8:33 IST

google News
  • Vikram - Trisha: కెరీర్ ఆరంభంలో హీరోహీరోయిన్లుగా క‌లిసి న‌టించిన విక్ర‌మ్‌, త్రిష ఆ త‌ర్వాత అన్నాచెల్లెళ్లుగా మ‌ణిర‌త్నం సినిమాలో క‌నిపించారు. ఆ సినిమాలు ఏవంటే?

విక్ర‌మ్‌, త్రిష
విక్ర‌మ్‌, త్రిష

విక్ర‌మ్‌, త్రిష

Vikram - Trisha: హీరోహీరోయిన్లుగా క‌లిసి న‌టించిన ఓ జంట అన్నాచెల్లెళ్లుగా స్క్రీన్‌పై క‌నిపించ‌డం అరుద‌నే చెప్పాలి. కొన్ని సార్లు మాత్రమే అలాంటి కాంబినేష‌న్ ఆవిష్కృతం అవుతుంది. విక్ర‌మ్‌, త్రిష విష‌యంలో అది జ‌రిగింది. హీరోహీరోయిన్లుగా త‌మిళంలో రెండు సినిమాలు చేసిన విక్ర‌మ్‌, త్రిష‌...ఆ త‌ర్వాత మ‌ణిర‌త్నం పొన్నియ‌న్ సెల్వ‌న్‌లో మాత్రం అన్నాచెల్లెళ్లుగా క‌నిపించారు.

ఫ‌స్ట్ టైమ్ సామి...

విక్ర‌మ్‌, త్రిష కాంబినేష‌న్‌లో ఫ‌స్ట్ టైమ్ సామి సినిమా వ‌చ్చింది. హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో 2003లో రిలీజైన ఈ త‌మిళ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. దాదాపు ఐదు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన సామి 48 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. పోలీస్ క‌థ‌ల ట్రెండ్‌కు కోలీవుడ్‌లో శ్రీకారం చుట్టింది. ఈ సినిమాలో విక్ర‌మ్‌, త్రిష జోడీ, వారి కెమిస్ట్రీ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్న‌ది. త్రిష కెరీర్‌లో ఫ‌స్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా సామినే చెబుతుంటారు అభిమానులు. సామికి ముందు మూడు సినిమాలు చేసినా అవేవీ ఆమెకు పెద్ద‌గా పేరు తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి. సామి మూవీతో కోలీవుడ్ వ‌ర్గాల దృష్టిని ఆక‌ర్షించింది త్రిష‌.

భీమాతో రెండోసారి...

సామి హిట్ కావ‌డంతో విక్ర‌మ్‌, త్రిష కాంబోలో నాలుగేళ్ల గ్యాప్ త‌ర్వాత భీమా మూవీ వ‌చ్చింది. 2007లో రిలీజైన భీమా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచినా పాట‌ల్లో విక్ర‌మ్‌, త్రిష రొమాన్స్ మాత్రం మెప్పించింది. భీమా సినిమాకు లింగుసామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ గ్యాంగ్‌స్ట‌ర్ ల‌వ్ స్టోరీ నిర్మాత ఏఎమ్‌ర‌త్నానికి భారీ న‌ష్టాల‌ను మిగిల్చింది. తెలుగులో ఈ సినిమాను డ‌బ్ చేయాల‌ని ప్ర‌య‌త్నించారు. కానీ త‌మిళ రిజ‌ల్ట్ ఎఫెక్ట్ కార‌ణంగా రిలీజ్ ఆగిపోయింది.

పొన్నియ‌న్ సెల్వ‌న్‌లో…

భీమా త‌ర్వాత విక్ర‌మ్‌, త్రిష క‌ల‌యిక మ‌రో సినిమా రావ‌డానికి ప‌దిహేనేళ్లు ప‌ట్టింది. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పొన్నియ‌న్ సెల్వ‌న్‌లో విక్ర‌మ్‌, త్రిష న‌టించారు. ఈ హిస్టారిక‌ల్ మూవీలో హీరోహీరోయిన్లుగా కాకుండా అన్నాచెల్లెళ్లుగా క‌నిపించారు. చోళ యువ‌రాజు ఆదిత్య క‌రికాళుడిగా విక్ర‌మ్ క‌నిపించ‌గా...అత‌డి సోద‌రి కుందైవిగా త్రిష న‌టించింది. రెండు పార్ట్‌లుగా పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమాను తెర‌కెక్కించాడు మ‌ణిర‌త్నం. ఫ‌స్ట్ పార్ట్ స‌క్సెస్ కాగా...సెకండ్ పార్ట్ డిజాస్ట‌ర్ అయ్యింది.

పొన్నియ‌న్ సెల్వ‌న్ పార్ట్ 1తో త్రిష కోలీవుడ్‌లో క‌మ్‌బ్యాక్ ఇచ్చింది. మ‌ణిర‌త్నం మూవీ త‌ర్వాత లియో మూవీలో విజ‌య్‌కి జోడీగా న‌టించింది. బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్‌ల‌తో మ‌ళ్లీ తెలుగు, త‌మిళ భాష‌ల్లో బిజీగా మారింది.

విశ్వంభ‌రతో రీఎంట్రీ...

చిరంజీవి విశ్వంభ‌ర‌తో తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. సోషియో ఫాంట‌సీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు బింబిసార ఫేమ్‌ వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత ఈ మూవీతో టాలీవుడ్‌లోకి తిరిగి అడుగుపెట్ట‌బోతున్న‌ది. అలాగే త‌మిళంలో అజిత్ విదా ముయార్చి, క‌మ‌ల్‌హాస‌న్‌తో థ‌గ్ లైఫ్ సినిమాలు చేస్తోంది త్రిష‌. మ‌ల‌యాళంలో ఐడెంటీటీ, రామ్ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాల‌న్నీ 2024లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు స‌మాచారం.

తదుపరి వ్యాసం