Jailer vs Vikram Collections: కమల్‌హాసన్ విక్రమ్ ఆల్‌టైమ్ కలెక్షన్స్‌ను ఆరు రోజుల్లోనే దాటేసిన జైలర్
Jailer vs Vikram Collections: రజనీకాంత్ జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఆరు రోజుల్లోనే కమల్‌హాసన్ విక్రమ్ మూవీ లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను దాటేసి రికార్డ్ క్రియేట్ చేసింది.
Jailer vs Vikram Collections: రజనీకాంత్ (Rajinikanth) జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. ఆరు రోజుల్లోనే ఈ మూవీ నాలుగు వందల కోట్ల క్లబ్‌లోకి ఎంటరైంది. మంగళవారం నాటికి ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 416 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
కమల్‌హాసన్ (Kamal Haasan)సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ మూవీ విక్రమ్ ఆల్‌టైమ్ కలెక్షన్స్‌ను రజనీకాంత్ జైలర్ కేవలం ఆరు రోజుల్లోనే అధిగమించడం గమనార్హం. విక్రమ్ మూవీ టోటల్ థియేట్రికల్ రన్‌లో 410 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మంగళవారం నాటితో కమల్‌హాసన్ రికార్డ్‌ను రజనీకాంత్ బ్రేక్ చేశాడు. తెలుగులో ఆరు రోజుల్లో జైలర్ మూవీ 29 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్‌ను రాబట్టింది. నిర్మాతలకు ఇప్పటివరకు 15 కోట్లకుపైగా లాభాల్ని తెచ్చిపెట్టింది.
రోబో తర్వాత రజనీకాంత్ తెలుగు డబ్బింగ్ మూవీస్‌లో హయ్యెస్ట్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టిన సినిమాగా జైలర్ రికార్డ్ క్రియేట్ చేసింది. జైలర్ సినిమాకు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించాడు. ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ క్యారెక్టరైజేషన్స్, కామెడీ టైమింగ్‌ను కొత్త పంథాలో జైలర్ సినిమాలో ఆవిష్కరించాడు నెల్సన్.
ఈ సినిమాలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీష్రాఫ్ అతిథి పాత్రల్లో నటించారు. రజనీకాంత్ భార్యగా రమ్యకృష్ణ నటించింది. తమన్నా, సునీల్ కీలక పాత్రల్లో కనిపించారు. సన్ పిక్చర్స్ సంస్థ జైలర్ మూవీని నిర్మించింది. తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్, ఎషియన్ సినిమాతో కలిసి దిల్‌రాజు జైలర్ మూవీని రిలీజ్ చేశాడు.