Bigg Boss 7 Telugu Vote: సెప్టెంబర్ 3న ప్రారంభమైన బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లోకి మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా వారిలో నలుగురు ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. ప్రస్తుతం హౌజ్‌లో 10 మంది ఉన్నారు. అయితే, వారిలో బిగ్ బాస్ 7 తెలుగు ఐదో వారం నామినేషన్లలో (Bigg Boss 7 Telugu 5th Week Nominations) అమర్ దీప్, శివాజీ, ప్రిన్స్ యావర్, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, శుభ శ్రీ, ప్రియాంక జైన్ ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు.
నామినేషన్లలో ఉన్నవారికి నమోదైన ఓటింగ్ పోల్ వివరాలు (Bigg Boss 7 Telugu 5th Week Voting Result) బిగ్ బాస్ వర్గాల నుంచి లీక్ అయ్యాయి. దాని ప్రకారం మొదటి స్థానంలో 38.73 శాతంతో హీరో శివాజీ టాప్‌లో ఉన్నాడు. ఇక తర్వాతి స్థానంలో యావర్ ప్లేస్ కొట్టేసి గౌతమ్ కృష్ణ ముందుకు వచ్చాడు. అంటే 26.22 శాతంతో గౌతమ్ రెండో స్థానంలో ఉన్నాడు. 8.83 శాతంతో యావర్ నిలిచాడు. తర్వాత వరుసగా 7.37 శాతంతో శుభ శ్రీ నాలుగు, 7.08 శాతంతో టేస్టీ తేజ ఐదు స్థానాల్లో ఉన్నారు.
అంతుకు ముందు చివర్లో ఉన్న తేజ ఇటీవలి పర్ఫామెన్సుతో సీరియల్ హీరో హీరోయిన్ అమర్, ప్రియాంకను నెట్టి ముందుకు వచ్చాడు. ఇక అమర్ దీప్ 6.38 శాతంతో ఆరు, 5.39 శాతంతో ప్రియాంక ఏడో స్థానంలో ఆఖరున ఉన్నారు. అంటే ఈవారం ప్రియాంకనే ఎలిమినేట్ (Bigg Boss 7 Telugu 5th Week Elimination) అయ్యే అవకాశం కనిపిస్తోంది. సీరియల్ బ్యాచ్ అయిన అమర్, ప్రియాంక తమ ఆట తీరుతో నెగెటివిటీ తెచ్చుకున్నారు.
ఇదిలా ఉంటే ఆదివారం (అక్టోబర్ 8)న బిగ్ బాస్ 7 తెలుగు 2.0 సీజన్ (Bigg Boss 7 Telugu 2.0) ప్రారంభం కానుంది. ఆరోజున ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ తో మినీ గ్రాండ్ లాంచ్ చేయనున్నారు. రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ లాంచ్‌లో వైల్డ్ కార్డు ద్వారా అర్జున్ అంబటి, పూజా మూర్తి, కెవ్వు కార్తీక్, నయని పావని, భోలే ఎంట్రీ ఇవ్వనున్నారు. దానికి సంబంధించిన డ్యాన్స్, ఏవీ ఇప్పటికే షూట్ కూడా చేసేశారు.
రెండు రోజుల్లో మినీ గ్రాండ్ లాంచ్ ద్వారా కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇస్తుంటే పాత కంటెస్టెంట్ ప్రియాంక జైన్ ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే, గ్రాండ్ లాంచ్ ఉంది కాబట్టి, అది జరిగే ఆదివారం నాడు ఎలిమినేషన్ ఉండకపోయే ఛాన్స్ కూడా ఉంది. ఇక ఇది ఉల్టా పుల్టా సీజన్ కాబట్టి ఎలిమినేట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
టాపిక్