Tamannah-Vijay varma : తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు కష్టాలు.. పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి
22 July 2023, 6:01 IST
- Tamannah-Vijay varma : ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ఈ మధ్య కాలంలో తన వృత్తి జీవితం కంటే వ్యక్తిగత జీవితం గురించి వార్తల్లో నిలిచాడు. విజయ్ తమన్నాతో డేటింగ్ చేస్తున్నాడు. అందుకే ఏదో కారణంగా వార్తల్లో ఉంటున్నాడు. విజయ్ వర్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనపై పెళ్లి ఒత్తిడి గురించి వెల్లడించాడు.
తమన్నా-విజయ్ వర్మ
విజయ్ వర్మ, తమన్నా రిలేషన్ షిప్(Tamannah-Vijay varma Relationship) అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు. తమన్నా కూడా వీరిద్దరి ప్రేమ వ్యవహారాన్ని బహిరంగంగానే చెప్పుకొచ్చింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ వర్మ తన పెళ్లి గురించి చెప్పాడు. తనపై ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నాడు.
'నేను మార్వాడీని. మా దాంట్లో అబ్బాయిల వివాహ వయస్సు తక్కువే. పెళ్లి గురించి ఒత్తిడి చాలా కాలం క్రితం ప్రారంభమైంది. నాకు పెళ్లి వయసు దాటిపోయింది. అంతేకాదు అప్పటికి నటుడిని అయ్యాను. నేను ఈ ప్రశ్నల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నా కెరీర్‌పై మాత్రమే దృష్టి పెట్టాను, కానీ ఇప్పుడు కూడా మా అమ్మ నా పెళ్లి గురించి పట్టుబట్టింది. ఇప్పటికీ ప్రతి ఫోన్ కాల్‌లో పెళ్లి గురించి అడుగుతుంది. కానీ నేను సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటాను. జీవితంలో ఎదుగుతున్నాను.' అని విజయ్ వర్మ చెప్పుకొచ్చాడు.
విజయ్ వర్మ, తమన్నా భాటియా సంబంధం గురించి పుకార్లు ఈ సంవత్సరం ప్రారంభంలో మెుదలయ్యాయి. ఆ సమయంలో గోవాలో జరిగిన ఓ పార్టీలో వీరిద్దరూ ముద్దులు పెట్టుకున్న వీడియో కూడా వైరల్‌గా మారింది. అప్పటి నుండి, ఇద్దరూ చాలా సందర్భాలలో కలిసి కనిపించారు. కలిసి 'లస్ట్ స్టోరీ 2'లో(Lust Stories 2) నటించారు. ఈ సిరీస్‌లో వీరిద్దరి జోడీ అభిమానులకు బాగా నచ్చింది.
విజయ్ వర్మ(Vijay Varma)తో తమన్నా ప్రస్తుతం ప్రేమలో ఉంది. వారిద్దరూ చాలా చోట్ల కనిపిస్తున్నారు. లస్ట్ స్టోరీస్ 2లో రెచ్చిపోయి నటించారు. తాను విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నానని తమన్నా కూడా చెప్పింది. 'ఒకరు నాతో నటించారని ఆకర్షణ ఉండదు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది నటీనటులతో నటించాను. నేను ఎవరికీ ఆకర్శితురాలిని కాలేదు. మీకు నిజంగా ఒకరిపై క్రష్ ఉంటే, భావాలు చాలా ప్రైవేట్‌గా ఉంటాయి. ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, ఏం చేస్తున్నాడు, సక్సెస్ ఫుల్ పర్సన్ కాదా అనేది లెక్కలోకి తీసుకోరు.' అని తమన్నా చెప్పుకొచ్చింది. విజయ్ వర్మను 'నా ఆనంద నిధి' అని అభివర్ణించింది.
విజయ్ తన రాబోయే క్రైమ్ డ్రామా సిరీస్ కలకత్తా కోసం సిద్ధమవుతున్నాడు. తమన్నా చిరంజీవి సరసన భోళా శంకర్(Bhola Shankar) సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. ఎలా ఉన్నా.. ఇద్దరు మాత్రం.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. లస్ట్ స్టోరీస్ 2లో ఈ జంట నటనపై చాలా మంది కామెంట్స్ చేశారు.