Bholaa Shankar Milky Beauty Song: భోళా శంకర్ నుంచి ‘మిల్కీ బ్యూటీ’ సాంగ్ వచ్చేసింది-milky beauty lyrical song from bholaa shankar released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bholaa Shankar Milky Beauty Song: భోళా శంకర్ నుంచి ‘మిల్కీ బ్యూటీ’ సాంగ్ వచ్చేసింది

Bholaa Shankar Milky Beauty Song: భోళా శంకర్ నుంచి ‘మిల్కీ బ్యూటీ’ సాంగ్ వచ్చేసింది

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 21, 2023 04:32 PM IST

Bholaa Shankar Milky Beauty Song: భోళా శంకర్ సినిమా నుంచి మిల్కీ బ్యూటీ అనే పాట రిలీజ్ అయింది. ఈ సాంగ్‍కు హీరో చిరంజీవి, తమన్నా స్టెప్పులు వేశారు.

Bholaa Shankar Milky Beauty Song: భోళా శంకర్ నుంచి ‘మిల్కీ బ్యూటీ’ సాంగ్ వచ్చేసింది
Bholaa Shankar Milky Beauty Song: భోళా శంకర్ నుంచి ‘మిల్కీ బ్యూటీ’ సాంగ్ వచ్చేసింది

Bholaa Shankar Milky Beauty Song: భోళా శంకర్ సినిమా నుంచి మూడో పాట వచ్చేసింది. మిల్కీ బ్యూటీ అంటూ సాగే పూర్తి లిరికల్ సాంగ్‍ను చిత్ర యూనిట్ నేడు (జూలై 21) రిలీజ్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండగా.. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మహతీ స్వరసాగర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నాడు. నేడు భోళా శంకర్ చిత్రం నుంచి థర్డ్ సింగిల్ వచ్చింది.

ఈ ‘మిల్కీ బ్యూటీ’ పాట చిరంజీవి, హీరోయిన్ తమన్నా భాటియా మధ్య డ్యుయెట్‍‍గా ఉంది. ఈ సాంగ్‍కు వారిద్దరు వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. చిరంజీవి క్లాస్ స్టెప్‍లు హైలైట్‍గా ఉన్నాయి. మిల్కీ బ్యూటీ తమన్నా చాలా ఈజ్‍గా డ్యాన్స్ చేసింది. అందంగా కనిపించింది.   మిల్కీ బ్యూటీ పాటను మహతీ స్వరసాగర్, విజయ్ ప్రకాశ్, సంజన ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాటను రాశారు. శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. 'పంచదార చిలక లాంటి.. ప్యారీ సుకుమారి' అంటూ మొదలయ్యే ఈ సాంగ్‍ను మెలోడియస్‍గా కంపోజ్ చేశాడు మహతీ స్వరసాగర్. భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న థియేటర్లలో విడుదల కానుంది.

తమిళ సినిమా వేదాళంకు రీమేక్‍గా భోళా శంకర్ రూపొందింది. ఈ మూవీలో చిరంజీవి చెల్లెలి పాత్రను ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేశ్ పోషించింది. రాంబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఏకే ఎంటర్‌మెంట్స్ బ్యానర్‌పై వస్తోంది.

భోళా శంకర్ సినిమాలో సుశాంత్, తరుణ్ అరోరా, మురళీ శర్మ, వెన్నెల కిశోర్ శ్రీముఖి కీలక పాత్రల్లో నటించారు. ట్యాక్సీ డ్రైవర్‌గా ఈ చిత్రంలో కనిపించనున్నాడు మెగాస్టార్. 

భోళా శంకర్ నుంచి వచ్చిన భోళా మేనియా, జామ్ జామ్ జజ్జనక పాటలు ఆకట్టుకున్నాయి. గతంలో రిలీజైన టీజర్ కూడా మెప్పించింది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు టాలీవుడ్‍లో పెద్ద హిట్ లేని డైరెక్టర్ మెహర్ రమేశ్.. ఈ చిత్రంతో సక్సెస్ కొట్టాలని ఆశిస్తున్నాడు. ఈ ఏడాది వాల్తేరు వీరయ్యతో బ్లాక్‍బాస్టర్ కొట్టిన చిరంజీవి.. అదే జోరు కొనసాగిస్తాడని అభిమానులు భావిస్తున్నారు. భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న థియేటర్లలో విడుదల కానుంది. 

Whats_app_banner