Tamannaah on first date: ఫస్ట్ డేట్‌లోనే తమన్నా, విజయ్ వర్మ సెక్స్ చేశారా.. వాళ్లేమన్నారంటే
Tamannaah on first date: ఫస్ట్ డేట్‌లోనే తమన్నా, విజయ్ వర్మ సెక్స్ చేశారా? లస్ట్ స్టోరీస్ 2లో కలిసి నటించిన ఈ ఇద్దరూ సెక్స్, పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్ లాంటి విషయాలపై స్పందించారు.
Tamannaah on first date: తమన్నా ఫస్ట్ డేట్ లోనే సెక్స్ చేసిందా? ఈ మధ్య వెబ్ సిరీస్ లలో నటిస్తూ బోల్డ్ సీన్లు కూడా చేసేస్తున్న తమన్నా.. స్క్రీన్ బయట కూడా అంతే బోల్డ్ గా సమాధానాలు ఇస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి ఆమె నటించిన లస్ట్ స్టోరీస్ 2 ఆంథాలజీ గురువారం (జూన్ 29) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.
ఈ సందర్భంగా విజయ్ తో కలిసి తమన్నా ఓ ఇంటర్వ్యూ చేసింది. ఫస్ట్ డేట్ లోనే సెక్స్, పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్, లస్ట్ స్టోరీస్ 2.. ఇలా వివిధ అంశాలపై తమన్నా, విజయ్ స్పందించారు. ఈ ఆంథాలజీలోనూ వీళ్లు కొన్ని బోల్డ్ సీన్లలో కలిసి నటించిన విషయం తెలిసిందే. ట్రైలర్ రిలీజైనప్పుడే ఈ సీన్లు వైరల్ గా మారాయి.
ఫస్ట్ డేట్ లోనే సెక్స్
తమన్నా తన ఫస్ట్ డేట్ లోనే సెక్స్ చేసిందా? ఈ ప్రశ్నకు ఆమె స్పందిస్తూ లేదని చెప్పింది. తానెప్పుడూ ఫస్ట్ డేట్ లోనే సెక్స్ చేయలేదని స్పష్టం చేసింది. అయితే తన లైఫ్ లో ఓ చెత్త డేట్ కూడా ఉందని కూడా ఆమె చెప్పడం విశేషం. అది ఎవరితో, ఏం జరిగింది అని మాత్రం చెప్పలేదు. అటు విజయ్ వర్మ కూడా ఫస్ట్ డేట్ లోనే సెక్స్ పై స్పందిస్తూ.. కచ్చితంగా చేయాలి అన్నాడు.
పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్
లస్ట్ స్టోరీస్ 2లో పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్ అనే ఓ డబుల్ మీనింగ్ డైలాగ్ ఉంది. నీనా గుప్తా నోటి నుంచి ఈ డైలాగ్ వస్తుంది. దీనిని నమ్ముతారా అని కూడా ఈ ఇంటర్వ్యూలో తమన్నా, విజయ్ ని అడిగారు. దీనిపై విజయ్ స్పందిస్తూ.. నీనా చెప్పిన ప్రతి విషయం నిజమే అని తాను నమ్ముతున్నట్లు చెప్పాడు. అటు తమన్నా కూడా ఇది కరెక్టే అని అనడం విశేషం. తాను కూడా పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్ మంచిదే అని చెప్పింది.
ఐదేళ్ల కిందట నెట్‌ఫ్లిక్స్ లోనే వచ్చిన లస్ట్ స్టోరీస్ ఆంథాలజీకి కొనసాగింపుగా ఇప్పుడీ లస్ట్ స్టోరీస్ 2 వచ్చింది. ఇందులో తమన్నా, విజయ్ వర్మతోపాటు కాజోల్, మృనాల్ ఠాకూర్, అంగద్ బేడీ, అమృతా సుభాష్, తిలోత్తమా షోమ్, కుముద్ మిశ్రా, నీనా గుప్తాలాంటి వాళ్లు నటించారు. ఈ ఆంథాలజీకి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.
సంబంధిత కథనం