తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Deverakonda Rashmika Mandanna: పెళ్లి దుస్తుల్లో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా.. ఫొటో వైరల్‌

Vijay Deverakonda Rashmika Mandanna: పెళ్లి దుస్తుల్లో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా.. ఫొటో వైరల్‌

HT Telugu Desk HT Telugu

22 November 2022, 19:35 IST

    • Vijay Deverakonda Rashmika Mandanna: పెళ్లి దుస్తుల్లో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా కనిపించిన ఫొటో వైరల్‌ అవుతోంది. ఈ ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో ఈ ఫొటో సంచలనం రేపుతోంది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా

Vijay Deverakonda Rashmika Mandanna: పైన ఉన్న ఫొటో చూశారు కదా. ఈ ఫొటో చూడగానే ఏమనిపిస్తోంది. ఇప్పటికే రిలేషన్‌షిప్‌లో ఉన్న విజయ్‌, రష్మిక ఎవరికీ చెప్పకుండా సీక్రెట్‌గా పెళ్లి కూడా చేసేసుకున్నారా అని అనిపిస్తోందా? అలా అనిపించడంలో తప్పేమీ లేదు. వీళ్ల మధ్య ఏదో నడుస్తోందని చాలా రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలుసు కదా.

ట్రెండింగ్ వార్తలు

Hi Nanna: హాయ్ నాన్న సినిమాకు మరో అంతర్జాతీయ వేదికపై అవార్డుల పంట.. ఆరు పురస్కారాలు: ఏఏ విభాగాల్లో వచ్చాయంటే..

Samantha: ‘అది ఫేక్’: సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమంత ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..

Chitram Choodara OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

ఆ మధ్య ఇద్దరూ కలిసి మాల్దీవ్స్‌ టూర్‌కు కూడా వెళ్లి వచ్చారు. ఇప్పటి వరకూ ఇద్దరూ తమ రిలేషన్‌షిప్‌పై ఓపెన్‌ కాలేదు. తాము కేవలం మంచి ఫ్రెండ్స్ అని మాత్రమే చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరూ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుగా కనిపించడం షాక్‌కు గురి చేసింది. అయితే ఈ ఫొటో నిజమైనది కాదు. ఓ అభిమాని ఎడిట్‌ చేసిన ఫొటో ఇది.

వైట్‌ షేర్వాణీలో విజయ్‌ నవ్వుతూ కనిపించగా, గోల్డెన్‌ లెహెంగాలో రష్మిక సిగ్గుపడుతూ ఉన్న ఫొటో ఇది. దీనికి ఆ అభిమాని కేవలం "విరోష్‌" అని క్యాప్షన్‌ పెట్టడం విశేషం. ఈ మధ్య సెలబ్రిటీల రిలేషన్‌షిప్‌, పెళ్లిళ్లలకు ఇలా ఇద్దరి పేర్లు కలిపి పెట్టడం కామనైపోయింది కదా. అలా విజయ్‌, రష్మిక జోడీని విరోష్‌ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.

ఈ ఫొటో ఫ్యాన్‌ మేడ్‌ అయినా కూడా ట్విటర్‌లో ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్న ఈ కపుల్‌ను చూసి ఇదే నిజం కావాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఏదో ఒక రోజు ఈ ఎడిటింగ్‌ రియాల్టీ అవుతుందని ఒకరు, వావ్‌ అద్భుతం అని మరొకరు ఈ ఫొటోకు కామెంట్‌ చేశారు.

కొన్నాళ్ల కిందటే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని, ఈ ఏడాది చివర్లో ఏడడుగులు వేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే విజయ్‌ మాత్రం ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టి పారేశాడు. గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్‌లాంటి మూవీస్‌లో వీళ్లిద్దరూ కలిసి నటించిన విషయం తెలిసిందే. గీత గోవిందం నుంచే వీళ్ల మధ్యే ఏదో నడుస్తోందన్న పుకార్లు మొదలయ్యాయి.

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ.. సమంతతో కలిసి ఖుషీ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అటు రష్మిక బాలీవుడ్‌లో బిజీ అయింది. ఆమె మిషన్‌ మజ్నూ, యానిమల్‌లాంటి మూవీస్‌లో నటిస్తోంది. ఇక తెలుగులో పుష్ప 2, విజయ్‌ వారసుడుల్లోనూ కనిపించనుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.