Janhvi Kapoor on Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండ పెళ్లయిపోయిందట.. జాన్వీ చెప్పింది!-janhvi kapoor on vijay deverakonda says he is practically married ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Janhvi Kapoor On Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండ పెళ్లయిపోయిందట.. జాన్వీ చెప్పింది!

Janhvi Kapoor on Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండ పెళ్లయిపోయిందట.. జాన్వీ చెప్పింది!

HT Telugu Desk HT Telugu

Janhvi Kapoor on Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండ పెళ్లయిపోయిందట. ఈ విషయాన్ని బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.

విజయ్ దేవరకొండ, జాన్వీ కపూర్ (twitter)

Janhvi Kapoor on Vijay Deverakonda: టాలీవుడ్‌ నటుడు విజయ్‌ దేవరకొండ లైగర్‌ మూవీతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు కానీ.. అంతకు ముందే బాలీవుడ్‌ భామల మనసు గెలుచుకున్నాడు. జాన్వీ కపూర్‌, సారా అలీఖాన్‌లాంటి యువ బాలీవుడ్‌ నటీమణుల మనసు అతడు ఎప్పుడో దోచుకున్నాడు. ఆ మధ్య కాఫీ విత్‌ కరణ్‌ షోలో విజయ్‌తో డేటింగ్‌ కోసం ఈ ఇద్దరు బ్యూటీస్‌ పోటీ పడ్డారు.

ఇక తాజాగా జాన్వీ కపూర్‌ మరోసారి విజయ్‌తో డేటింగ్‌, పెళ్లి గురించి స్పందించింది. తన లేటెస్ట్‌ మూవీ మిలీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న జాన్వీ.. బాలీవుడ్‌ బబుల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తాను స్వయంవరం చేసుకోవాల్సి వస్తే ఫిల్మ్‌ ఇండస్ట్రీ నుంచి ఏ ముగ్గురు నటులను ఎన్నుకుంటావని అడిగారు. దీనిపై స్పందించిన జాన్వీ.. ప్రస్తుతం తాను ఎవరితోనూ డేటింగ్‌ చేయడం లేదని చెప్పింది.

ఒకవేళ తాను స్వయంవరం చేసుకోవాల్సి వస్తే హృతిక్‌ రోషన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, టైగర్‌లను ఎంచుకుంటానని చెప్పడం విశేషం. అయితే అప్పుడే ఆమెకు రణ్‌బీర్‌ కపూర్‌కు పెళ్లయిపోయిన విషయం గుర్తుకు వచ్చింది. అంతేకాదు హృతిక్‌కు కూడా అయిపోయింది కదా అనుకొని.. ఇంకా పెళ్లి కాని వాళ్లు ఎవరున్నారు అని ఆలోచించింది.

అదే సమయంలో విజయ్‌ దేవరకొండ గురించి ఇంటర్వ్యూలో అడిగారు. ఆ సమయంలో అతనికి దాదాపుగా పెళ్లయిపోయింది అని చెప్పడం విశేషం. జాన్వీ ఎందుకలా చెప్పిందన్న విషయం ఫ్యాన్స్‌కు అంతుబట్టడం లేదు. రష్మికతో విజయ్‌ డేటింగ్‌లో ఉన్నాడని చాలాకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలుసు కదా. ఆమె కూడా అదే ఉద్దేశంతో అలా చెప్పిందా అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మధ్యే విజయ్‌, రష్మిక కలిసి మాల్దీవ్స్‌ వెకేషన్‌కు కూడా వెళ్లి వచ్చిన సంగతి తెలుసు కదా. ఈ టూర్‌తో వీళ్లిద్దరి మధ్య రిలేషన్‌షిప్‌పై అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇప్పుడు జాన్వీ అతనికి పెళ్లయిపోయినట్లే అని చేసిన కామెంట్స్‌ ఫ్యాన్స్‌ను మరింత గందరగోళానికి గురి చేస్తున్నాయి. తమ మధ్య రిలేషన్‌షిప్‌పై ఇప్పటి వరకూ విజయ్‌గానీ, రష్మికగానీ బయటపడలేదు.

ఈ పుకార్లను కూడా తాము లైట్‌గా తీసుకుంటామని చెబుతూ వస్తున్నారు. అయితే ఓవైపు సీరియస్‌ రిలేషన్‌షిప్‌లో ఉంటూనే బయట వచ్చే వార్తలకు స్పందించకూడదని ఈ ఇద్దరూ డిసైడ్‌ అయినట్లు దీనిని బట్టి తెలుస్తోంది.