Ranbir Kapoor on Alia Bhatt: ఆలియాతో బెడ్‌పై కష్టమే: రణ్‌బీర్‌ కపూర్‌-ranbir kapoor on alia bhatt says he tolerates her sleeping positions ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ranbir Kapoor On Alia Bhatt: ఆలియాతో బెడ్‌పై కష్టమే: రణ్‌బీర్‌ కపూర్‌

Ranbir Kapoor on Alia Bhatt: ఆలియాతో బెడ్‌పై కష్టమే: రణ్‌బీర్‌ కపూర్‌

HT Telugu Desk HT Telugu
Sep 26, 2022 04:31 PM IST

Ranbir Kapoor on Alia Bhatt: ఆలియాతో బెడ్‌పై కష్టమే అంటున్నాడు రణ్‌బీర్‌ కపూర్‌. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ఆమెను ఆ విషయంలో ఎలా భరిస్తున్నాడో వివరించాడు.

<p>బ్రహ్మాస్త్ర మూవీ ప్రమోషన్లలో ఆలియా, రణ్ బీర్ కపూర్</p>
బ్రహ్మాస్త్ర మూవీ ప్రమోషన్లలో ఆలియా, రణ్ బీర్ కపూర్

Ranbir Kapoor on Alia Bhatt: బ్రహ్మాస్త్ర స్టార్లు రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ నిజ జీవితంలోనూ పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ ఇద్దరూ త్వరలోనే తమ తొలి సంతానాన్ని కూడా ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 14న పెళ్లి చేసుకున్న ఈ సెలబ్రిటీ జంట.. జూన్‌లో తాము తల్లిదండ్రులం కాబోతున్న విషయాన్ని వెల్లడించింది.

yearly horoscope entry point

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆలియాతో బెడ్‌పై తాను పడే కష్టాలను సరదాగా వివరించాడు రణ్‌బీర్‌ కపూర్‌. ఆమెతో ఒకే బెడ్‌పై పడుకోవడం ఎంత కష్టమో చెబుతూ తెగ ఫీలయ్యాడు. బాలీవుడ్‌ బబుల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌ మాట్లాడుతూ.. ఆలియా నిద్రలోకి జారుకున్న తర్వాత బెడ్‌ మొత్తం ఆక్రమించేస్తుందని, తాను ఓ మూలకు సర్దుకుంటానని చెప్పాడు.

ఇది నిజానికి ఎంతో మంది భర్తలు తమ భార్యల గురించి సరదాగా చెప్పే విషయమే. "ఆలియా నిద్రపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే.. ఆమె తల ఓ చోట, కాళ్లు మరో చోట ఉంటాయి. దీంతో బెడ్‌పై నాకు స్థలం సరిపోదు. క్రమంగా నేను ఓ మూలకు సర్దుకుపోవాల్సి వస్తుంది. నిజంగా ఇది నాకో సమస్యగా మారిపోయింది" అంటూ రణ్‌బీర్‌ నవ్వుతూ చెప్పాడు.

అయితే ఆలియాలో నచ్చిన విషయం కూడా అతడు చెప్పాడు. ఆమె ఏ పని చేసినా అద్భుతంగా చేస్తుందని అన్నాడు. ఇదే ప్రశ్నను ఆలియాను కూడా రణ్‌బీర్‌ గురించి అడిగితే.. "రణ్‌బీర్‌లో నాకు నచ్చే విషయం అతని మౌనం. అతడో మంచి శ్రోత. చెప్పినవన్నీ వింటాడు. అయితే ఆ మౌనాన్ని కూడా నేను అప్పుడప్పుడూ భరించాల్సి వస్తోంది. కొన్నిసార్లు అతడు స్పందించాలని నేను అనుకుంటాను కానీ అతడు మాత్రం స్పందించడు" అని చెప్పింది.

ఎన్నో ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఏప్రిల్‌లో పెళ్లితో ఒక్కటైంది. ఈ ఇద్దరూ కలిసి నటించిన తొలి సినిమా బ్రహ్మాస్త్రనే. రూ.410 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. బాక్సాఫీస్‌ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.400 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ మూవీలో అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున కూడా నటించిన విషయం తెలిసిందే.

ఇక ఈ మూవీ తర్వాత ఆలియా చేతిలో పలు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌ మూవీతో హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తోంది. ఇక రాజమౌళి, మహేష్‌ బాబు మూవీలోనూ ఆమెనే ఫిమేల్‌ లీడ్‌లో కనిపించనుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. అటు రణ్‌బీర్‌ కపూర్‌ మన టాలీవుడ్ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో యానిమల్‌ మూవీ చేస్తున్నాడు.

Whats_app_banner