Ranbir Kapoor: పిల్లల కోసం ఆలియా కెరీర్‌ త్యాగం చేయొద్దనే ఈ నిర్ణయం: రణ్‌బీర్‌-ranbir kapoor wants to share responsibilities with alia bhatt after they become parents ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ranbir Kapoor: పిల్లల కోసం ఆలియా కెరీర్‌ త్యాగం చేయొద్దనే ఈ నిర్ణయం: రణ్‌బీర్‌

Ranbir Kapoor: పిల్లల కోసం ఆలియా కెరీర్‌ త్యాగం చేయొద్దనే ఈ నిర్ణయం: రణ్‌బీర్‌

HT Telugu Desk HT Telugu
Jul 11, 2022 01:56 PM IST

Ranbir Kapoor: బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ ఓ మంచి తండ్రిలాగా ఉండాలని అనుకుంటున్నాడు. అందుకే పిల్లల కోసం ఆలియా తన కెరీర్‌ త్యాగం చేయకుండా ఇప్పుడే ఓ ప్లాన్‌ రెడీ చేసి పెట్టుకున్నాడు.

<p>బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ ఆలియా, రణ్‌బీర్‌ కపూర్‌</p>
బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ ఆలియా, రణ్‌బీర్‌ కపూర్‌ (ANI)

మూడు నెలల కిందట పెళ్లితో ఒక్కటయ్యారు రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌. ఈ మధ్యే తాను తల్లి కాబోతున్నట్లు ఆమె అనౌన్స్‌ చేసింది. ఈ బాలీవుడ్‌ కపుల్‌ పేరెంటింగ్‌ విషయంలోనూ మంచి ప్లాన్‌తో ఉన్నట్లు తాజాగా రణ్‌బీర్‌ కామెంట్స్‌ను బట్టి అర్థమవుతోంది. తమకు బిడ్డ పుట్టిన తర్వాత ఆలియా తన కెరీర్‌ను నష్టపోకుండా తాను కూడా తండ్రిగా బాధ్యతలు తీసుకోనున్నట్లు చెప్పాడు.

ఈ మధ్య ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌ దీనిపై మాట్లాడాడు. "ఈ విషయంపై ఆలియా, నేను కొంతకాలం నుంచి మాట్లాడుకుంటున్నాం. మా సమయం, బాధ్యతలను ఎలా పంచుకోవాలో చర్చించుకున్నాం. మా చిన్నతనంలో మా ఫ్యామిలీలోని తండ్రులంతా బిజీగా ఉండేవారు. తల్లులే మా బాధ్యతలు చూశారు. అందుకే మేము వాళ్లకే ఎక్కువ దగ్గరగా ఉంటాం. మా పిల్లల విషయంలో ఇది మారాలని అనుకుంటున్నా. పిల్లలు నాకు కూడా దగ్గర కావాలని భావిస్తున్నా" అని రణ్‌బీర్‌ చెప్పాడు.

"ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఆలియా చాలా బిజీ యాక్టర్‌. బిడ్డ కోసం తన కలలను ఆమె త్యాగం చేయాలని నేను అనుకోవడం లేదు. అందుకే మేమిద్దరం మా వ్యక్తిగత, ప్రొఫెషనల్‌ జీవితాలను బ్యాలెన్స్‌ చేసుకునేలా ప్లాన్‌ చేసుకోవాలి. ఆ దిశగా మెల్లగా అడుగులు వేస్తున్నాం" అని రణ్‌బీర్‌ చెప్పాడు. ఆలియా ఈ మధ్య తన హాలీవుడ్‌ డెబ్యూ మూవీ హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌ షూటింగ్‌ పూర్తి చేసుకొని యూరప్‌ నుంచి ఇండియాకు వచ్చింది. ఇప్పుడు ప్రెగ్నెంట్‌ కావడంతో ఆమె ప్రాజెక్టులు కొంత కాలం పాటు నిలిచిపోనున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం