తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay Devarakonda Shows His Love Towards Samantha

Vijay Deverakonda College Crush: అప్పుడే స‌మంత‌తో ప్రేమ‌లో ప‌డ్డా - విజ‌య్ దేవ‌ర‌కొండ ట్వీట్ వైర‌ల్‌

28 October 2022, 12:42 IST

  • Vijay Deverakonda College Crush: కాలేజీ రోజుల నుంచి స‌మంత‌ను ప్రేమిస్తున్న‌ట్లు విజ‌య్ దేవ‌ర‌కొండ ( Vijay Deverakonda) ట్వీట్ చేశాడు. అత‌డి ట్వీట్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌
స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌

స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Vijay Deverakonda College Crush: కాలేజీ రోజుల్లోనే స‌మంత‌తో ప్రేమ‌లో ప‌డ్డాన‌ని అన్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇప్ప‌టికీ ఆమెను ఆరాధిస్తూనే ఉన్నాన‌ని ట్వీట్ చేశాడు. . స‌మంత (Samantha) హీరోయిన్‌గా న‌టించిన య‌శోద (Yashoda) సినిమా తెలుగు ట్రైల‌ర్‌ను గురువారం విజ‌య్ దేవ‌ర‌కొండ సోష‌ల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఈ ట్రైల‌ర్‌ను విడుద‌ల‌చేస్తూ కాలేజీలో చ‌దువుకునే రోజుల్లో తొలిసారి స‌మంత‌ను బిగ్‌స్క్రీన్‌పై చూశాన‌ని అన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Andre Russel Hindi Song: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో వెస్టిండీస్ క్రికెటర్.. హిందీ పాట పాడిన రసెల్

Hollywood Thrillers on OTT: ఓటీటీల్లోని ఈ హాలీవుడ్ థ్రిల్లర్స్ చూశారా? అసలు థ్రిల్ అంటే ఏంటో తెలుస్తుంది

Panchayat 3 OTT Release Date: సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Pushpa 2 first single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

అప్ప‌డే ఆమెతో ప్రేమ‌లో ప‌డ్డాన‌ని చెప్పాడు. ఇప్ప‌టికీ సమంతను ఆరాధిస్తూనే ఉన్నాన‌ని విజ‌య్ ట్వీట్ చేశాడు. స‌మంత‌ సాధించిన విజ‌యాల ప‌ట్ల‌ గ‌ర్వ‌ప‌డుతున్న‌ట్లు పేర్కొన్నాడు. య‌శోద‌ చిత్ర యూనిట్‌కు ఆల్‌ది బెస్ట్ చెప్పాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ట్వీట్‌ను విజ‌య్‌, స‌మంత అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

స‌రోగ‌సీ బ్యాక్‌డ్రాప్‌లో య‌శోద సినిమా తెర‌కెక్కుతోంది. హ‌రి, హ‌రీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈట్రైల‌ర్‌లో స‌మంత యాక్టింగ్‌, ఆమెపై తెర‌కెక్కించిన యాక్ష‌న్ సీక్వెన్స్‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. న‌వంబ‌ర్ 11న ఈ సినిమా రిలీజ్ కానుంది.

కాగా ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత క‌లిసి ఖుషి (Kushi Movie) సినిమా చేస్తున్నారు. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా తాజా షెడ్యూల్ వ‌చ్చే నెల‌లో ప్రారంభంకానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. య‌శోద‌, ఖుషితో పాటు తెలుగులో శాకుంత‌లం సినిమా చేస్తోంది స‌మంత‌.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.