తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Urvashi Rautela In Kantara 2: కాంతార -2 లో వాల్తేర్ వీర‌య్య బ్యూటీ - గాసిప్ అంటూ షాకిచ్చిన సినిమా యూనిట్‌

Urvashi Rautela In Kantara 2: కాంతార -2 లో వాల్తేర్ వీర‌య్య బ్యూటీ - గాసిప్ అంటూ షాకిచ్చిన సినిమా యూనిట్‌

11 February 2023, 21:07 IST

  • Urvashi Rautela In Kantara 2:కాంతార -2 సినిమాలో బాలీవుడ్ న‌టి ఊర్వ‌శి రౌటేలా లీడ్ రోల్‌లో న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.  హీరో రిష‌బ్ శెట్టితో ఊర్వ‌శి దిగిన ఓ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

రిష‌బ్ శెట్టి ఊర్వ‌శి రౌటేలా
రిష‌బ్ శెట్టి ఊర్వ‌శి రౌటేలా

రిష‌బ్ శెట్టి ఊర్వ‌శి రౌటేలా

Urvashi Rautela In Kantara 2: గ‌త ఏడాది దేశ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న ద‌క్షిణాది సినిమాల్లో కాంతార ఒక‌టి. రిష‌బ్ శెట్టి హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఇండియా వైడ్‌గా 400 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఇందులో రిష‌బ్ శెట్టి న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ట్రెండింగ్ వార్తలు

Romeo OTT Release Date: విజయ్ ఆంటోనీ ‘రోమియో’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటే..

Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

కాంతార సినిమాకు ప్రీక్వెల్‌ను రూపొందించ‌బోతున్న‌ట్లు ఇటీవ‌లే హీరో రిష‌బ్ శెట్టితో పాటు నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిల్మ్స్ ప్ర‌క‌టించింది. కాగా ఈ సీక్వెల్‌లో బాలీవుడ్ న‌టి ఊర్వ‌శి రౌటేలా న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. శ‌నివారం హీరో రిష‌బ్ శెట్టితో క‌లిసి దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఊర్వశి రౌటేలా.

కాంతార 2 లోడింగ్ అంటూ ఈ ఫొటోను ఉద్దేశించి క్యాప్ష‌న్ జోడించింది. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాంతార ప్రీక్వెల్‌లో ఊర్వ‌శి రౌటేలా న‌టిస్తోన్న‌ట్లు ప్ర‌చారం మొద‌లైంది.

అవ‌న్నీ పుకార్లేన‌న్నసినిమా యూనిట్‌

ఊర్వ‌శి రౌటేలా ఈ సినిమాలో భాగం కాబోతున్న‌ట్లు వ‌స్తోన్న వార్త‌ల‌పై చిత్ర యూనిట్ స్పందించింది. ప్ర‌స్తుతం స్క్రిప్ట్‌కు సంబంధించిన ప‌నులు జ‌రుగుతోన్న‌ట్లు తెలిపింది. హీరోయిన్‌తో పాటు ఇత‌ర న‌టీన‌టులు ఎవ‌రిని ఫైనలైజ్ చేయలేదని వెల్ల‌డించింది.

హోంబ‌లే ఫిల్మ్స్ ప్ర‌తినిధుల‌ను ఊర్వ‌శి క‌లిసిన‌ట్లు తెల‌సింది. ఆ స‌మ‌యంలోనే రిష‌బ్ శెట్టితో ఆమె ఫొటో దిగింద‌ని అంటున్నారు. ఇటీవ‌లే వాల్తేర్ వీర‌య్య సినిమాలో స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించింది ఊర్వ‌శి రౌటేలా. ఈ పాట‌తోనే ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.