తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Urvashi Special Song In Waltair Veerayya: మెగాస్టార్‌తో ఆ బాలీవుడ్ బ్యూటీ ప్రత్యేక గీతం.. ఎవరో తెలుసా?

Urvashi Special Song in Waltair Veerayya: మెగాస్టార్‌తో ఆ బాలీవుడ్ బ్యూటీ ప్రత్యేక గీతం.. ఎవరో తెలుసా?

04 November 2022, 16:25 IST

    • Urvashi Special Song in Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఇందులో ఓ ప్రత్యేక గీతంలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా నటించనున్నట్లు సమాచారం.
వాల్తేరు వీరయ్య చిత్రంలో ఊర్వశి రౌతేలా ప్రత్యేక గీతం
వాల్తేరు వీరయ్య చిత్రంలో ఊర్వశి రౌతేలా ప్రత్యేక గీతం

వాల్తేరు వీరయ్య చిత్రంలో ఊర్వశి రౌతేలా ప్రత్యేక గీతం

Urvashi Special Song in Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి-మాస్ మహారాజ రవితేజ కలిసి నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. మాస్ లుక్‌తో మన మెగాస్టార్ అదరగొట్టారు. ఎప్పుడో ముఠామేస్తీ సినిమాతో ఆయన లుక్‌‍ను తాజాగా ఈ సినిమాతోనూ గుర్తుకుతెచ్చారు. రవితేజ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో చిరంజీవికి.. మాస్ మహారాజాకు ఓ ప్రత్యేక గీతం ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఇటీవలే ఈ పాటను హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో పూర్తి కూడా చేసినట్లు తెలుస్తోంది. తాజాగా మరో ఆసక్తికర అప్డేట్ ఫిల్మ్ వర్గాల్లో నడుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Chitram Choodara OTT Release Date: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

Aa Okkati Adakku Collections: బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్కటి అడక్కు మూవీ జోరు.. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా..

Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఎక్కడ చూడొచ్చంటే..

ఈ సినిమాలో ఓ స్పెషల్ ఐటెమ్ సాంగ్ కూడా ఉండనుందట. ఈ ప్రత్యేకగీతంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌటేలా నర్తించనున్నట్లు సమాచారం. ఇందుకోసం భారీ సెట్‌ను చిత్రబృందం నిర్మించిందట. ఈ అదిరిపోయే ప్రత్యేక గీతానికి దేవిశ్రీ ప్రసాద్ తన దైన మ్యూజిక్‌తో ఊపు తెప్పించనున్నాడని, ప్రేక్షకులను మరోసారి ఉర్రూతలూగించినున్నారని అనుకుంటున్నారు.

ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టార్ నృత్యాలను సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది. ఊర్వశి అందాలకు తోడు.. దేవిశ్రీపసాద్ మ్యూజిక్.. మెగాస్టార్ స్టెప్పులు తోడవ్వడంతో సినిమాలో ఇది దుమ్మురేపుతోందని అంచనాలు వేసుకుంటున్నారు.

బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 2023 జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తొలిసారిగా చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా చేస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.