Chiranjeevi: నా బ్యాక్‌గ్రౌండ్ గురించి నేనే చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చింది - చిరంజీవి
Chiranjeevi: తన బ్యాక్‌గ్రౌండ్ గురించి తానే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సిన దుస్థితి ఇంట్లోనే వచ్చిందని అన్నాడు చిరంజీవి. శుక్రవారం జరిగిన శూన్యం నుండి శిఖరాగ్రాలకు పుస్తకావిష్కరణ వేడుకలో చిరంజీవి తన లైఫ్‌లోని ఫన్నీ ఇన్సిడెంట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Chiranjeevi: నేనేమిటో నా బ్యాక్‌గ్రౌండ్ ఏమిటో చెప్పుకోవాల్సిన దుస్థితి నా ఇంట్లోనే ఏర్పడిందనిచిరంజీవి ఫన్నీగా కామెంట్స్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన శూన్యం నుండి శిఖరాగ్రాలకు పుస్తకావిష్కరణ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఇంట్లో ఎనిమిదేళ్లు, ఐదేళ్ల వయసున్న మనవరాళ్లు ఉన్నారు.
వాళ్లకు హీరోలుగా రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయితేజ్ మాత్రమే తెలుసు. వాళ్లనే హీరోలుగా ఫీలవుతుంటారు. వాళ్ల సాంగ్స్ మాత్రమే వింటుంటారు, చూస్తుంటారు. నా కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ ఉన్నాయి. కానీ అవేవీ అడకుండా చరణ్ నాటు నాటు సాంగ్ అడుగుతుండేవారు. అవన్నీ చూసినప్పుడు కొన్నిసార్లు కడుపు మండిపోతుండేది.
నేనెవరో, నా బ్యాక్‌గ్రౌండ్ ఏమిటో మనవరాళ్లకు చెప్పాలని కొవిడ్ టైమ్‌లో డిసైడ్ అయ్యాను. నా గురించి నేను చెప్పుకోవాల్సిన దుస్థితి నా ఇంట్లోనే ఏర్పడింది. నా గురించి నేను చిన్న పిల్లలకు చెబితే ఇన్‌సల్ట్‌గా ఉంటుందని ఎవరూ లేని టైమ్‌లో నా కెరీర్‌లోనే బెస్ట్ సాంగ్స్, మూవ్‌మెంట్స్ వాళ్లకు చూపించాను. అవన్నీ నా మనవరాళ్లకు బాగా నచ్చాయి.
గాడ్‌ఫాదర్ సినిమాను నాలుగు సార్లు చూశారు. అందులో చిన్న పిల్లలకు నచ్చే అంశాలు ఏమున్నాయో తెలియదు. నీ స్టైల్, యాక్టింగ్ బాగుందని మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఇప్పుడు మా ఇంట్లో నేను హీరో అనే ఫీలింగ్ వచ్చేసింది. ఇందుకోసం చిన్న పిల్లల ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సివచ్చింది అని ఫన్నీగా కామెంట్స్ చేశారు చిరంజీవి. చిరంజీవి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవలే గాడ్‌ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు చిరంజీవి. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు మోహన్‌రాజా దర్శకత్వం వహించాడు. సల్మాన్‌ఖాన్ కీలక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం వాల్తేర్ వీరయ్య, భోళాశంకర్ సినిమాలతో చిరంజీవి బిజీగా ఉన్నారు.