తెలుగు న్యూస్  /  Entertainment  /  Upendra And Kicha Sudeep New Movie Kabza Will Arrive On 2023 March 17

Kabza Release Date: ఉపేంద్ర-కిచ్చా సుదీప్ కబ్జ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. పాన్ఇండియా రేంజ్‌లో సినిమా

24 January 2023, 11:31 IST

    • Kabza Release Date: ఉపేంద్ర-కిచ్చా సుదీప్ కాంబోలో తెరకెక్కుతోన్న కబ్జ మూవీకి సంబంధించి చిత్రబృందం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసింది.
ఉపేంద్ర
ఉపేంద్ర

ఉపేంద్ర

Kabza Release Date కన్నడ హీరో ఉపేంద్రకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన పాతికేళ్ల క్రితం అతడు నటించిన ఉపేంద్ర సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత పలు డబ్బింగ్ సినిమాలతో పాటు కన్యాదానం, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సరికొత్త చిత్రం కబ్జ. కిచ్చా సుదీప్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా చిత్రబృందం ఈ సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

SS Rajamouli: అనిల్ రావిపూడి మీద ముసుగేసి గుద్దేస్తే 10వేలు ఇస్తా: దర్శక ధీరుడు రాజమౌళి.. ఎందుకు ఇలా అన్నారంటే..

OTT Movies This Weekend: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి రానున్న ఈ 4 చిత్రాలను మిస్ అవొద్దండి!

Rajinikanth Biopic: రజినీకాంత్ బయోపిక్ హక్కులను తీసుకున్న బాలీవుడ్ నిర్మాత! వివరాలివే

Panchayat S3 Release: ఈనెలలోనే స్ట్రీమింగ్‍కు రానున్న పంచాయత్ సీజన్ 3.. డేట్ కోసం ఫ్యాన్స్‌కు పని పెట్టిన ఓటీటీ

ఉపేంద్ర-కిచ్చా సుదీప్ కాంబోలో రాబోతున్న కబ్జ చిత్రాన్ని 2023 మార్చి 17న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. భారతీయ సినిమాలో మరో పెద్ద విషయం కబ్జ చిత్రాన్ని మార్చి 17న విడుదల చేయనున్నామని ఉపేంద్ర సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఇప్పటికే కబ్జ ఫస్ట్ లుక్, టీజర్‌ను విడుదల చేసిన చిత్రబృందం.. సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. 1942 కాలం నాటి వాతావ‌ర‌ణాన్ని చూపిస్తూ ఇంటెన్స్‌గా టీజర్ ఉంది. పాన్ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా మరో కేజీఎఫ్ మాదిరిగా హిట్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు.

1942 బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాకు ఆర్ చంద్రు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో తొలితరం గ్యాంగ్ స్టర్ గా ఉపేంద్ర కనిపించబోతున్నాడు. కన్నడ, తెలుగుతో పాటు మరో ఐదు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో ఉపేంద్రకు జోడీగా శ్రియ (shriya) హీరోయిన్ గా నటిస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.