Upendra kabza Teaser: రాఖీభాయ్ లేని కేజీఎఫ్ 3 ఇది - ఉపేంద్ర కబ్జా టీజర్ పై నెటిజన్ల కామెంట్స్
upendra kabzaTeaser: ఉపేంద్ర, సుదీప్ (kiccha sudeep) హీరోలుగా నటించిన కబ్జా టీజర్ ను హీరో రానా శనివారం విడుదలచేశారు. యశ్ కేజీఎఫ్ సినిమాను తలపిస్తూ కబ్జా టీజర్ లోని సన్నివేశాలు కనిపించడపై నెటిజన్లు సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
upendra kabzaTeaser: కన్నడ అగ్ర హీరోలు ఉపేంద్ర,కిచ్చా సుదీప్ తొలిసారి కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా కబ్జా. గ్యాంగ్ స్టర్ కథాంశంతో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమా రూపొందించింది. శనివారం కబ్జా టీజర్ ను హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) విడుదలచేశారు. 1942 కాలం నాటి వాతావరణాన్ని చూపిస్తూ ఇంటెన్స్‌గా ట్రైలర్ సాగింది.
ట్రెండింగ్ వార్తలు
ఈ టీజర్ లో బొగ్గు గనులను తలపించే నేపథ్యం మదర్ సెంటిమెంట్ సీన్,హీరో ఎలివేషన్స్ అన్ని యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్‌ను పోలి ఉన్నాయి. ఉపేంద్ర ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ తో పాటు రౌడీల మధ్యలో నుంచి అతడు ఎంట్రీ ఇచ్చే సీన్ కూడా కేజీఎఫ్‌ను గుర్తుకుతెస్తోంది. టీజర్ చివరలో ఉపేంద్రతో పాటు సుదీప్ కనిపించాడు. కాగా ఈ సినిమాను కేజీఎఫ్‌తో పోల్చుతూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
రాఖీభాయ్ లేని కేజీఎఫ్ 3 ఇదని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. కేజీఎఫ్ లో ఎడిట్ చేసి పక్కనపెట్టిన సీన్స్ తో కబ్జా సినిమాను తెరకెక్కించినట్లుగా కనిపిస్తుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కబ్జా టీజర్ చూస్తుంటే కేజీఎఫ్ టీజర్ చూసినట్లుగానే ఉందని మరికొందరు అంటున్నారు. 1942 బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాకు ఆర్ చంద్రు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో తొలితరం గ్యాంగ్ స్టర్ గా ఉపేంద్ర కనిపించబోతున్నాడు.
కిచ్చా సుదీప్ క్యారెక్టర్ డీటెయిల్స్ మాత్రం చిత్ర యూనిట్ రివీల్ చేయకుండా సస్పెన్స్ లో ఉంచింది. కన్నడ, తెలుగుతో పాటు మరో ఐదు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో ఉపేంద్రకు జోడీగా శ్రియ (shriya) హీరోయిన్ గా నటిస్తోంది.