తెలుగు న్యూస్  /  Entertainment  /  Unstoppable With Prabhas New Promo Out As Gopichand Joins Rebel Star

Unstoppable with Prabhas New Promo: ఆ హీరోయిన్‌ కోసం ప్రభాస్‌, గోపీచంద్‌ గొడవ పడ్డారా.. ఇంట్రెస్టింగా కొత్త ప్రోమో

Hari Prasad S HT Telugu

01 January 2023, 11:11 IST

    • Unstoppable with Prabhas New Promo: హీరోయిన్‌ కోసం ప్రభాస్‌, గోపీచంద్‌ గొడవ పడ్డారట. ఈ విషయం చెప్పింది మరెవరో కాదు నందమూరి బాలకృష్ణే. ప్రభాస్‌తో అన్‌స్టాపబుల్‌ రెండో ఎపిసోడ్‌కు సంబంధించి ఆహా కొత్త ప్రోమో రిలీజ్‌ చేసింది.
అన్‌స్టాపబుల్ షోలో బాలయ్యతో సందడి చేసిన ప్రభాస్, గోపీచంద్
అన్‌స్టాపబుల్ షోలో బాలయ్యతో సందడి చేసిన ప్రభాస్, గోపీచంద్

అన్‌స్టాపబుల్ షోలో బాలయ్యతో సందడి చేసిన ప్రభాస్, గోపీచంద్

Unstoppable with Prabhas New Promo: యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ను బాలయ్య ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది? గత గురువారం (డిసెంబర్‌ 29) దీనికి వచ్చిన రెస్పాన్స్‌ చూస్తే అది తెలుస్తుంది. అన్‌స్టాపబుల్‌లో ప్రభాస్‌ వస్తున్నాడన్న వార్త తెలిసినప్పటి నుంచీ ఆతృతగా ఎదురు చూసిన ఫ్యాన్స్‌.. షో ప్రారంభం కాగానే ఒక్కసారిగా ఆహాకు ట్యూన్‌ కావడంతో ఆ యాప్‌ క్రాష్‌ అయిపోయింది.

ట్రెండింగ్ వార్తలు

Prasanna Vadanam Twitter Review: ప్రసన్నవదనం ట్విట్టర్ రివ్యూ- సుహాస్ ఫేస్ బ్లైండ్‌నెస్‌ సస్పెన్స్ థ్రిల్లర్ ఆకట్టుకుందా

Guppedantha Manasu Serial: దేవ‌యాని త‌ప్పుకు శైలేంద్ర‌కు శిక్ష - మ‌నుకు షాకిచ్చిన రాజీవ్ - రిషి త‌మ్ముడికి వ‌సు స‌పోర్ట్

Aa Okkati Adakku Twitter Review: ఆ ఒక్కటి అడక్కు ట్విట్టర్ రివ్యూ.. అల్లరి నరేష్ కమ్ బ్యాక్ కామెడీ మూవీ హిట్ కొట్టిందా?

Krishna mukunda murari today episode: మురారిని బోల్తా కొట్టించిన మీరా.. కృష్ణ మీద అమితమైన ప్రేమ చూపిస్తున్న భవానీ

ఈ ఎపిసోడ్‌కు ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో ఇప్పుడు ఆహా ప్రభాస్‌ సెకండ్‌ ఎపిసోడ్‌ను తీసుకొస్తోంది. వచ్చే శుక్రవారం (జనవరి 6) ఈ ఎపిసోడ్‌ స్ట్రీమ్‌ కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను ఆదివారం (జనవరి 1) ఆహా ఓటీటీ రిలీజ్ చేసింది. ఈ కొత్త ఎపిసోడ్‌లో మాచో స్టార్‌ గోపీచంద్‌ కూడా ఎంట్రీ ఇచ్చాడు.

చాలా ఇంట్రెస్టింగ్‌గా ఈ ప్రోమో ఉంది. గోపీచంద్‌, ప్రభాస్‌లతో బాలయ్య ఓ ఆటాడుకున్నాడు. ఇబ్బందికరమైన ప్రశ్నలు వేశాడు. 2008లో ఓ హీరోయిన్‌ కోసం మీ ఇద్దరూ గొడవ పడ్డారట.. నిజమేనా అని బాలకృష్ణ అడిగాడు. దీనికి ప్రభాస్‌ స్పందిస్తూ.. చెప్పరా.. నేనైతే పడలేదు.. ఏదైనా ఉంటే చెప్పు అని తనదైన స్టైల్లో గోపీచంద్‌తో అనడం నవ్వు తెప్పిస్తుంది.

ఇక నయనతార, తమన్నాలలో ఎవరిని షాపింగ్‌కు తీసుకెళ్తావని అడిగితే.. ఇద్దరినీ తీసుకెళ్లిపోతా అని ప్రభాస్‌ అంటాడు. ఇక గోపీచంద్‌తో బాలయ్య మాట్లాడుతూ.. జిల్‌ మూవీలో అతని లుక్‌ మామూలుగా ఉండదని అన్నాడు. నువ్వు కూడా ప్రభాస్‌లాగే నవ్వుతూనే ఉంటావా మాట్లాడతావా.. అసలు మీ ఇద్దరేం మాట్లాడుకుంటారు అంటూ ప్రభాస్‌, గోపీచంద్‌లను బాలకృష్ణ ఆట పట్టించాడు.

తొలి ఎపిసోడ్ లో ప్రభాస్ తన డేటింగ్ రూమర్లపై స్పందించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కృతి సనన్ తో డేటింగ్ పై బాలయ్య ఓ ప్రశ్న అడిగాడు. నువ్వు ఎంతో మంది హీరోయిన్ల‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నావు. కానీ రాముడు సీత‌తోనే ఎందుకు ప్రేమ‌లో ప‌డ్డాడు అని ప్ర‌భాస్‌ను అడిగాడు బాల‌కృష్ణ‌. ఈ ప్ర‌శ్న‌కు అదేదో పాత న్యూస్‌.. ఏం లేద‌ని మేడ‌మ్ ఆల్రెడీ చెప్పేసింది అని ప్ర‌భాస్ చెప్ప‌డం ఆస‌క్తిని పంచుతోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.