Prabhas Unstoppable Episode Record: అన్‌స్టాపబుల్‌ షో అరుదైన ఘనత.. ప్రభాస్ ఎపిసోడ్‌కు రికార్డు వీక్షణలు-prabhas episode get 100 million streaming minutes unstoppable with nbk2 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Prabhas Episode Get 100 Million Streaming Minutes Unstoppable With Nbk2

Prabhas Unstoppable Episode Record: అన్‌స్టాపబుల్‌ షో అరుదైన ఘనత.. ప్రభాస్ ఎపిసోడ్‌కు రికార్డు వీక్షణలు

అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్-బాలకృష్ణ
అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్-బాలకృష్ణ

Prabhas Unstoppable Episode Record: బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో అరుదైన ఘనత సాధించింది. ప్రభాస్ ఎపిసోడ్‌కు రికార్డు వీక్షణలు వచ్చాయి. ఈ ఎపిసోడ్ 100 మిలియన్ల వ్యూయర్షిప్‌ను అందుకుంది.

Prabhas Unstoppable Episode Record: నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ పక్క సినిమాలతో పాటు మరోపక్క వ్యాఖ్యతగానూ అలరిస్తున్నారు. అన్‌స్టాపబుల్ షోతో బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా ప్రసారమవుతోన్న ఈ షోపై ప్రేక్షకులకు విపరీతంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం సీజన్2 నడుస్తోంది. ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌లు రాగా.. తాజాగా బాహుబలి ప్రభాస్ ఎపిసోడ్ గురువారం రాత్రి 9 గంటల నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ ఎపిసోడ్‌ మొదటి భాగం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

ఈ ఎపిసోడ్ 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దాటినట్లు ఆహా తెలిపింది. ఈ సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్, అభిమానులకు, ఆహా సబ్‌స్క్రైబర్లకు ధన్యవాదాలు తెలిపింది. ఈ ఎపిసోడ్‌లో బాలయ్య తనదైన హోస్టింగ్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

బాలకృష్ణతో ప్రభాస్ ఇంటర్వ్యూ అని ప్రకటించగానే అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ప్రతి సారి శుక్రవారం ప్రసారమయ్యే అన్‌స్టాపబుల్ ఎపిసోడ్.. ఫ్యాన్స్ కోసం ఓ రోజు ముందుగానే అంటే గురువారం రాత్రి 9 గంటల నుంచే స్ట్రీమింగ్ చేశారు. అయితే ఒక్కసారిగా ఆహా యాప్‌నకు వ్యూస్ పోటెత్తడంతో ప్రభాస్ తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఆగిపోయింది. సాంకేతిక సమస్య పరిష్కారమయ్యాకు ఎపిసోడ్ అందుబాటులోకి వచ్చింది.

ఈ ఎపిసోడ్‌లో బాలకృష్ణ-ప్రభాస్ సందడి అదిరిపోయింది. తన సినిమాలతో పాటు తనపై వస్తున్న గాసిప్స్‌పైన ప్రభాస్ స్పందించారు. మరోపక్క బాలకృష్ణ తనదైన సెటైర్లు, జోకులతో ప్రేక్షకులను అలరించారు. ప్రభాస్ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారం చేయనున్నారు. రెండో భాగంలో నటుడు గోపీచంద్ కూడా ప్రభాస్‌తో పాల్గొంటారు. వచ్చే శుక్రవారం ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.