తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sunil Tamil Debut: శివ‌కార్తికేయ‌న్ సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న సునీల్‌

Sunil Tamil Debut: శివ‌కార్తికేయ‌న్ సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న సునీల్‌

10 November 2022, 14:19 IST

  • Sunil Tamil Debut: క‌మెడియ‌న్ సునీల్ త‌మిళంలో అరంగేట్రం చేస్తున్నాడు. శివ‌కార్తికేయ‌న్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమా ఏదంటే...

సునీల్
సునీల్

సునీల్

Sunil Tamil Debut: తెలుగు స్టార్ క‌మెడియ‌న్ సునీల్ త‌మిళంలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. శివ‌కార్తికేయ‌న్‌తో ఓ సినిమా చేయ‌నున్నాడు. తెలుగులో అగ్ర హాస్య‌న‌టుల‌లో ఒక‌రిగా సునీల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. డిఫ‌రెంట్ డైలాగ్ డెలివ‌రీ, కామెడీ టైమింగ్‌తో ఎన్నో సినిమాలు స‌క్సెస్ కావ‌డానికి సునీల్ కీలకంగా నిలిచాడు. హాస్య‌న‌టుడిగా బిజీగా ఉన్న త‌రుణంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సునీల్ మ‌ర్యాద రామ‌న్న‌, పూల రంగ‌డుతో పాటు ప‌లు సినిమాల‌తో విజ‌యాల్ని అందుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Anand Devarakonda: బొంబాయి చట్నీ చేసిన కుర్రాడిగానే తెలుసు, కానీ.. ఆనంద్ దేవరకొండ కామెంట్స్

Brahmamudi: ఆఫీస్ సీసీ కెమెరాలో రాజ్ సీక్రెట్.. చూసేసిన కావ్య, అప్పు- వసుధార కొత్త స్కెచ్- మీరా షాక్‌లో మురారి, కృష్ణ

Heeramandi OTT: ఓటీటీలో దూసుకుపోతున్న పీరియాడికి డ్రామా.. నెటిజన్ల ప్రశంసలు.. సిరీస్ ఎక్కడ చూస్తారంటే?

Adivi Sesh: అదే కొనసాగిస్తే గర్వపడే స్థాయికి వెళ్తుంది.. హీరోయిన్‌పై అడవి శేష్ కామెంట్స్ వైరల్

హీరోగా ఆశించిన మేర అవ‌కాశాలు ద‌క్క‌క‌పోవ‌డంతో తిరిగి క‌మెడియ‌న్‌గా రీఎంట్రీ ఇచ్చిన సునీల్ ప్ర‌స్తుతం పూర్వవైభ‌వాన్ని సొంతం చేసుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నాడు. ఇటీవ‌ల విడుద‌లైన‌ ఊర్వ‌శివో రాక్ష‌సివో సినిమాలో సునీల్ కామెడీకి చ‌క్క‌టి స్పంద‌న ల‌భిస్తోంది.

తాజాగా సునీల్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. శివ‌కార్తికేయ‌న్ హీరోగా త‌మిళంలో మావీర‌న్ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. సూప‌ర్ హీరో క‌థాంశంతో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో సునీల్ ఓ కీల‌క పాత్ర‌ను పోషించ‌నున్నాడు. మావీర‌న్‌లో సునీల్‌ భాగ‌మ‌వుతోన్న‌ట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. అత‌డి పాత్ర క‌థాగ‌మ‌నంలో కీల‌కంగా ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది.

మావీర‌న్ సినిమాలో డైరెక్ట‌ర్ శంక‌ర్ కుమార్తె అదితిశంక‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాకు జాతీయ అవార్డ్ గ్ర‌హీత మ‌డోన్నే అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగులో మాహావీరుడు పేరుతో రిలీజ్ చేయ‌నున్నారు. కాగా సునీల్ ప్ర‌స్తుతం పుష్ప ది రూల్‌తో పాటు రామ్‌చ‌ర‌ణ్‌, శంక‌ర్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న సినిమాలో న‌టిస్తున్నాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.