తెలుగు న్యూస్  /  Entertainment  /  The Kashmir Files Controversy Who Is Nadav Lapid Who Made Controversial Comments

Kashmir Files Controversy Who is Nadav Lapid : కశ్మీర్‌ ఫైల్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన నదావ్‌ ఎవరు?

HT Telugu Desk HT Telugu

29 November 2022, 14:48 IST

  • Kashmir Files Controversy Who is Nadav Lapid: కశ్మీర్‌ ఫైల్స్‌ మూవీ నీచంగా, పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నట్లుగా ఉన్నదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఇజ్రాయెల్‌ ఫిల్మ్‌ మేకర్ నదావ్‌ లాపిడ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఎవరీ నదావ్‌ లాపిడ్‌?

ది కశ్మీర్ ఫైల్స్ మూవీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నదావ్ లాపిడ్
ది కశ్మీర్ ఫైల్స్ మూవీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నదావ్ లాపిడ్

ది కశ్మీర్ ఫైల్స్ మూవీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నదావ్ లాపిడ్

Kashmir Files Controversy Who is Nadav Lapid: ది కశ్మీర్‌ ఫైల్స్‌ మూవీ ఇప్పుడు మరోసారి ఇండియా వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ సినిమాపై ఇజ్రాయెల్‌ ఫిల్మ్‌ మేకర్‌, ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియా (ఇఫి) జ్యూరీ హెడ్‌ నదావ్ లాపిడ్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ సినిమాను నీచమైనదిగా, దుష్ప్రచారం చేసినట్లుగా ఉన్నదంటూ నదావ్‌ చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

Darshini: అతి తక్కువ బడ్జెట్‌లో సరికొత్త సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ దర్శిని.. కొత్త హీరో హీరోయిన్లతో మూవీ

Happy Ending OTT: ఓటీటీలోకి తెలుగు అడ‌ల్ట్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌

SS Rajamouli: అనిల్ రావిపూడి మీద ముసుగేసి గుద్దేస్తే 10వేలు ఇస్తా: దర్శక ధీరుడు రాజమౌళి.. ఎందుకు ఇలా అన్నారంటే..

OTT Movies This Weekend: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి రానున్న ఈ 4 చిత్రాలను మిస్ అవొద్దండి!

దీనిపై కశ్మీర్‌ ఫైల్స్‌ మూవీ టీమ్‌ నుంచి స్ట్రాంగ్‌ కౌంటర్లు ఎన్నో వచ్చాయి. డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌, ఇందులో నటించిన అనుపమ్ ఖేర్‌లాంటి వాళ్లు నదావ్‌ కామెంట్స్‌ను తిప్పికొట్టారు. ఇఫి ముగింపు సందర్భంగా మాట్లాడిన నదావ్.. కశ్మీర్‌ ఫైల్స్‌ అసలు ఇలాంటి ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించాల్సిన సినిమానే కాదని అన్నారు. అప్పటి నుంచీ ది కశ్మీర్‌ఫైల్స్‌తోపాటు నదావ్ కూడా ట్రెండింగ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎవరీ నదావ్‌ లాపిడ్‌ అన్నది ఆసక్తిగా మారింది.

ఎవరీ నదావ్‌ లాపిడ్?

నదావ్‌ లాపిడ్ ఇజ్రాయెల్‌కు చెందిన ఫిల్మ్‌ మేకర్‌. ఆ దేశంలోని టెల్‌ అవివ్‌లో జన్మించిన అతడు.. సినానిమ్స్‌, ది కిండర్‌గార్టెన్‌ టీచర్, పోలీస్‌మ్యాన్‌లాంటి సినిమాలతో పేరుగాంచాడు. ఎన్నో ప్రతిష్టాత్మక ఫిల్మ్స్ ఫెస్టివల్స్‌లో జ్యూరీ మెంబర్‌గా వ్యవహరించారు. 2015లో లాకార్నో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో గోల్డెన్‌ లెపార్డ్‌ జ్యూరీ సభ్యుడిగా, 2016లో కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో క్రిటిక్స్‌ వీక్‌ జ్యూరీ మెంబర్‌గా, 2021లో 71వ బెర్లిన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఆఫీషియల్‌ కాంపిటీషన్‌ జ్యూరీ మెంబర్‌గా ఉన్నారు.

తన సొంత దేశం ఇజ్రాయెల్‌తోనూ అతనికి సరైన సంబంధాలు లేవు. షోమ్రాన్‌ ఫిల్మ్‌ ఫండ్‌ను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన 250 మంది ఫిల్మ్‌ మేకర్స్‌లో నదావ్‌ కూడా ఒకడు. విమర్శలకు తావు లేని సినిమాలు తీసి తద్వారా ఆర్థిక సహకారం, బహుమతుల కోసమే ఈ ఫండ్ ఏర్పాటు చేసినట్లు వాళ్లు ఆరోపించారు. నదావ్‌ మూవీ సినానిమ్స్‌ కూడా ఇజ్రాయెల్‌పై నిర్మించిన ఓ విమర్శనాత్మక మూవీ కావడం గమనార్హం.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.