IFFI jury head on The Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ మూవీపై ఇఫీ జ్యూరీ హెడ్‌ సంచలన వ్యాఖ్యలు-iffi jury head on the kashmir files movie says its vulgar and felt like a propaganda ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Iffi Jury Head On The Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ మూవీపై ఇఫీ జ్యూరీ హెడ్‌ సంచలన వ్యాఖ్యలు

IFFI jury head on The Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ మూవీపై ఇఫీ జ్యూరీ హెడ్‌ సంచలన వ్యాఖ్యలు

HT Telugu Desk HT Telugu
Nov 28, 2022 10:42 PM IST

IFFI jury head on The Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ మూవీపై ఇఫీ వేదికగా ఈ ఫెస్టివల్‌ జ్యూరీ హెడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా నీచంగా ఉన్నదని, దుష్ప్రచారం చేయడానికే తీసినట్లుగా అనిపించిందని అనడం గమనార్హం.

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జ్యూరీ హెడ్ నదావ్
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జ్యూరీ హెడ్ నదావ్

IFFI jury head on The Kashmir Files: 53వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (IFFI) ఓ వివాదంతో ముగిసింది. ఇండియాలో సంచలనం రేపి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన కశ్మీర్‌ ఫైల్స్‌ మూవీపై ఐఎఫ్‌ఎఫ్‌ఐ జ్యూరీ హెడ్‌, ఇజ్రాయెల్‌ ఫిల్మ్‌ మేకర్‌ నదావ్‌ లాపిడ్‌ తీవ్ర విమర్శలు చేశారు.

ఈ సినిమా దుష్ప్రచారం చేయడానికి తీసినట్లుగా ఉన్నదని ఆయన అనడం గమనార్హం. స్టేజ్‌పై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. వివేక్‌ అగ్నిహోత్రి డైరెక్షన్‌లో వచ్చిన కశ్మీర్‌ ఫైల్స్‌ మూవీపై నదావ్‌ ఇలాంటి కామెంట్స్ చేయడం చాలా మందిని షాక్‌కు గురి చేసింది.

"మేమందరం 15వ సినిమా అయినా కశ్మీర్‌ ఫైల్స్ చూసి చాలా కలవరపడ్డాము, షాక్‌కు గురయ్యాం. మాకు అది దుష్ప్రచారంలాగా అనిపించింది. చాలా నీచంగా ఉంది. ఇలాంటి ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఆర్టిస్టిక్ కాంపిటీటివ్‌ సెక్షన్‌లో ఈ మూవీని ప్రదర్శించడం సరికాదు. స్టేజ్‌పై నిలబడి నా ఈ ఫీలింగ్స్‌ను ఓపెన్‌గా షేర్ చేసుకుంటున్నాను. ఇలాంటి విమర్శలు కూడా స్వీకరించడం ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వెనుక ఉన్న అసలు స్ఫూర్తి" అని నదావ్‌ అన్నారు.

కశ్మీర్‌ ఫైల్స్‌ మూవీని గత వారం ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఈ ఏడాది మార్చి 11న ఈ మూవీ రిలీజైంది. 1990ల్లో కశ్మీర్‌లో జరిగిన పండిట్‌ల ఊచకోత నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. దేశంలో ఈ సినిమా సంచలనం సృష్టించింది. వసూళ్ల వర్షం కురిపించింది. అయితే అదే స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి.

సింగపూర్ ఈ సినిమాపై నిషేధం కూడా విధించింది. ఈ సినిమా రెచ్చగొట్టేలా, ఏకపక్షంగా ఉన్నదని సింపూర్‌ అధికారులు చెప్పారు. ఈ కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాలో అనుపమ్‌ ఖేర్‌, మిథున్‌ చక్రవర్తిలాంటి సీనియర్‌ బాలీవుడ్‌ నటులు నటించారు.

Whats_app_banner