తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tarakratna Health : తారకరత్న హెల్త్ అప్డేట్.. బెంగళూరుకు నందమూరి కుటుంబం

Tarakratna Health : తారకరత్న హెల్త్ అప్డేట్.. బెంగళూరుకు నందమూరి కుటుంబం

Anand Sai HT Telugu

29 January 2023, 13:34 IST

    • Tarakratna Health Update : సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు ఇప్పటికే బెంగళూరుకు వెళ్లారు.
బెంగళూరులో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
బెంగళూరులో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ (twitter)

బెంగళూరులో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

నందమూరి తారకరత్న(Tarakaratna) హెల్త్ సీరియస్ గానే ఉంది. మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ తర్వాత కార్డియోజెనిక్ షాక్ కారణంగా అతడి ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉందని బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు. ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యులు బెంగళూరు చేరుకున్నారు. ఎన్టీఆర్(NTR), కల్యాణ్ రామ్ బెంగళూరు వెళ్లారు. తారకరత్నను చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు వస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

NNS May 6th Episode: మిస్సమ్మపై పగ సాధిస్తున్న పిల్లలు.. అరుంధతి చివరి కోరిక.. అమర్ మాటలకు కుప్పకూలిన రామ్మూర్తి

GMV OTT Official: మారిన హారర్ కామెడీ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్- అధికారిక ప్రకటన- 2 రోజుల ముందుగానే స్ట్రీమింగ్- ఎక్కడంటే?

The Goat Life OTT Release Date: ఈవారం ఓటీటీలోకి మరో మలయాళ సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

OTT Releases This Week: ఓటీటీలో ఈ వారం ఏకంగా 21 సినిమాలు.. ఇంట్రెస్టింగ్‌గా 7.. ఎక్కడ చూడాలంటే?

బెంగళూరుకు తరలించినప్పటి నుంచి.. బాలయ్య ఆసుపత్రిలోనే ఉన్నాడు. శనివారం రోజున టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), పురంధేశ్వరి, సుహాసిని తారకరత్న దగ్గరకు వెళ్లారు. ఆరోగ్య పరిస్థితి మీద డాక్టర్లను ఆరా తీశారు. ఆదివారం ఉదయం.. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకున్నారు. సోదరుడు తారకరత్న ఐసీయూలో చికిత్స పొందుతుండటం చూసి.. ఎన్టీఆర్ కంటతడిపెట్టారు.

తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బాలకృష్ణ(Balakrishna) తెలిపారు. ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌(Shiva Raj Kumar) ఆదివారం పరామర్శించారు. అనంతరం బాలకృష్ణతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బాలకృష్ణ తెలిపారు. ఇంప్రూవ్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నట్టుగా వెల్లడించారు.

తారకరత్నకు గుండెపోటుతో పాటుగా మరో వ్యాధి కూడా ఉందని డాక్టర్లు నిర్ధారించారు. మెలెనా(Melena) అనే అరుదైన వ్యాధి ఉందని తెలిపారు. ఈ కారణంగానే అతడి ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలుస్తోంది. ఇప్పటికీ తారకరత్న ఆరోగ్యపరిస్థితి క్లిష్టంగానే ఉంది. సోమవారం మరోసారి వైద్య పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది.

తారకరత్నకు ఎక్మో(ECMO) ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. ప్రస్తుతం ఐసీయూలో కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. తారకరత్నకు గుండెపోటు అని వార్తలు వచ్చినప్పటి నుంచి ఆయన త్వరగా కోలుకోలవాని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

మెలెనా వ్యాధి అంటే..

మెలెనా వ్యాధి జీర్ణశయాంతక రక్తస్రావానికి సంబంధించి ఓ అరుదైన వ్యాధి. ఈ వ్యాధి బారిన పడితే.. వారి మలం జిగటగా, నల్లగ వస్తుంది. అలానే మెలెనాతో అన్నవాహిక నోరు, పొట్ట, చిన్నపేగు మెుదటి భాగం రక్తస్రావానికి గురి అవుతూ ఉంటుంది. అయితే కొన్ని కేసుల్లో మాత్రం ఎక్కువ జీర్ణశయాంతర దిగువ భాగంలో ఉండే పెద్ద పేగు భాగంలో కూడా రక్తస్రావం జరిగే ఛాన్స్ ఉంది. పెప్టిక్ అల్సర్స్ ట్రీట్మెంట్, ఎండోస్కోపీ థెరపీ వంటి చికిత్సలను చేస్తారని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే యాంజియోగ్రాఫిక్ ఎంబలైజేషన్, సర్జికల్ థెరపీలతో పాటు రక్తాన్ని మార్పిడి చేయాలి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.