తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tamannah Relationship : విజయ్ కంటే ముందు తమన్నా లైఫ్‌లో కోహ్లీ..! మిల్కీ బ్యూటీ ఏం చెప్పింది?

Tamannah Relationship : విజయ్ కంటే ముందు తమన్నా లైఫ్‌లో కోహ్లీ..! మిల్కీ బ్యూటీ ఏం చెప్పింది?

Anand Sai HT Telugu

17 June 2023, 12:33 IST

google News
    • Tamannah Relationship : ఈ మధ్య కాలంలో నటి తమన్నా పేరు వార్తల్లో బాగా వినిపిస్తుంది. ఓ వైపు ఆమె నటించిన వెబ్ సిరీస్ కారణమైతే.. మరోవైపు ఆమె ప్రేమ వ్యవహారంపై కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
తమన్నా
తమన్నా

తమన్నా

మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా భాటియా(Tamannah Bhatia) తెలుగు చిత్రాల్లోనూ చాలా ఫేమస్. మెుత్తం 73 కంటే ఎక్కువ చిత్రాలలో నటించింది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డును కూడా గెలుచుకుంది. తమన్నాకు చిత్ర పరిశ్రమలో చాలా డిమాండ్ ఉంది. ఆమె పారితోషికం కూడా కోట్లకు మించి ఉంటుంది. ప్రస్తుతం తమన్నా వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. ఇటీవలే ఆమె నటించిన జీ కర్దా(Jee Karda) వెబ్ సిరీస్ విడుదలైంది. లస్ట్ స్టోరీ 2(Lust Stories 2) విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ రెండింటిలోనూ మునుపెన్నడూ లేని విధంగా రెచ్చిపోయి నటించింది తమన్నా.

ఇదంతా పక్కన పెడితే.. ఆమె ప్రేమ వ్యవహారం కూడా ఈ మధ్యకాలంలో బాగా హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే ఆమెతో కొంతమంది పేర్లు వినిపించాయి. గతంలో విరాట్ కోహ్లీ(Virat Kohli)తో డేటింగ్ చేసిందంటూ కూడా పుకారు ఉంది. వీరిద్దరి పేరు ఒకప్పుడు బాగానే వినిపించింది. ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఓ ప్రకటన షూటింగ్‌లో విరాట్‌ కోహ్లీ, తమన్నా(Virat Kohli-Tamannah) కలుసుకున్నారు. ఆ తర్వాత వీరి బంధంపై వార్తలు ఊపందుకున్నాయి. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ విషయం చాలా ఏళ్లుగా వినిపిస్తోంది. గతంలోనే ఈ విషయంపై తమన్నా క్లారిటీ ఇచ్చింది. తమన్నా భాటియా ఒక ఇంటర్వ్యూలో తనకు, కోహ్లీకి ఎప్పుడూ సంబంధం లేదని స్పష్టం చేసింది. 'యాడ్ ఫిల్మ్ సమయంలో మేం మాట్లాడుకున్నాం అంతే. ఆ తర్వాత నేనెప్పుడూ విరాట్ కోహ్లీని కలవలేదు. విరాట్ కోహ్లీతో కలిసి పనిచేయడం.. చాలా మంది నటుల కంటే మెరుగ్గా ఉంది.' అని డేటింగ్ వార్తలను తమన్నా ఖండించింది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ(Virat Kohli-Anushka Sharma)ను పెళ్లి చేసుకున్న తర్వాత మీరు ఏమనుకున్నారు అనే ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చింది. 'వారు మంచి జంట. వారి వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాను.' అని తెలిపింది. తమన్నా గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం ప్రస్తుతం ఆమె విజయ్ వర్మ(Vija Varma)తో ప్రేమలో ఉండటం. అప్పటి విషయాన్ని కొందరు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు.

నటుడు విజయ్ వర్మతో తన ప్రేమ వ్యవహారాన్ని తమన్నా ఒప్పుకొంది. విజయ్ తో కలిసి ఉంటే ఆనందంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే, తాను ఒకరితో డేటింగ్‌లో ఉన్నట్లు బహిరంగంగా అంగీకరించడం ఇదే తొలిసారి. తమన్నా విజయ్ తో ఉన్న ప్రేమను అంగీకరించి.

మరోవైపు అనుష్క శర్మతో వివాహానికి ముందు, విరాట్ కోహ్లీ(Virat Kohli) పేరు చాలా మంది నటీమణులు, మోడల్స్‌తో వినిపించింది. తమన్నా భాటియాతో పాటు విరాట్ కోహ్లీ పేరు బ్రెజిలియన్ మోడల్ ఇసాబెల్లె లైట్‌తో వార్తల్లో నిలిచింది. కోలీవుడ్ నటి సాక్షి అగర్వాల్ పేరు కూడా అప్పట్లో బాగా వినిపించింది. కానీ చివరకు అనుష్క శర్మను విరాట్ కోహ్లీ 11 డిసెంబర్ 2017న ఇటలీలో వివాహం చేసుకున్నాడు.

తదుపరి వ్యాసం