Virat Kohli : విరాట్ కోహ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాలి-virat kohli to move to delhi capitals says kevin pietersen ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Virat Kohli To Move To Delhi Capitals Says Kevin Pietersen

Virat Kohli : విరాట్ కోహ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాలి

Anand Sai HT Telugu
May 24, 2023 09:20 AM IST

Virat Kohli : విరాట్ కోహ్లీ మెుదటి నుంచి ఆర్సీబీ తరఫున ఆడుతున్నాడు. మంచి మంచి ప్రదర్శనలు ఇచ్చాడు. అయితే కింగ్ కోహ్లీ తన స్వస్థలమైన ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాల్సిందిగా అభ్యర్థనలు వస్తున్నాయి.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (PTI)

ఈ ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) అద్భుత ప్రదర్శన చేశాడు. కింగ్ కోహ్లీ 14 ఇన్నింగ్స్‌ల్లో 2 భారీ సెంచరీలతో 639 పరుగులు చేశాడు. అయితే ప్లేఆఫ్‌కు అర్హత సాధించడంలో RCB విఫలమైంది. అందుకే విరాట్ కోహ్లీ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) తరఫున ఆడాలని ఆర్సీబీ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు.

ట్రెండింగ్ వార్తలు

గుజరాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబి ఓటమి తర్వాత ట్వీట్ చేసిన కెవిన్ పీటర్సన్, విరాట్ కోహ్లీ ఢిల్లీ జట్టుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. కింగ్ కోహ్లీ తన సొంత గడ్డ అయిన ఢిల్లీ తరఫున ఆడాలని అభిప్రాయాన్ని కెవిన్ పీటర్సన్ ముందుకు తెచ్చాడు. దీనికి ప్రధాన కారణం ఆర్సీబీ తరఫున వరుసగా 16 ఏళ్లు ఆడినప్పటికీ కింగ్ కోహ్లీ ట్రోఫీని ముద్దాడలేకపోవడమే.

అందువల్ల, రాబోయే సీజన్లలో తన స్వస్థలమైన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాలని సూచించాడు. అంతకుముందు కింగ్ కోహ్లీకి పీటర్సన్ జట్టును మార్చమని సలహా ఇచ్చాడు. అదే జట్టుకు చాలా ఏళ్లుగా ఆడుతున్న విరాట్ కోహ్లి మంచి ప్రదర్శన ఇచ్చాడు. అయితే తన స్వస్థలమైన ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాల్సిందిగా అభ్యర్థించాడు పీటర్సన్.

కెవిన్ పీటర్సన్ 2009, 2010లో RCB తరపున ఆడాడు. 6 మ్యాచ్‌లలో RCB జట్టుకు నాయకత్వం వహించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున మొత్తం 13 మ్యాచ్‌లు ఆడిన పీటర్సన్ 329 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో అత్యధిక శతకాలు నమోదు చేసిన ఆటగాడిగా విరాట్ రికార్డు సృష్టించాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో కోహ్లీ మొత్తంగా 7 సెంచరీలు నమోదు చేశాడు. ఫలితంగా ఇప్పటి వరకు ఆరు సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్న క్రిస్ గేల్ రికార్డును అధిగమించాడు. అంతేకాకుండా టీ20 ఫార్మాట్‌లో 12 వేల పరుగుల క్లబ్‌లో చేరిపోయాడు. గుజరాత్‌తో ఆదివారం నాడు జరిగిన మ్యాచ్‌లో 61 బంతుల్లో 101 పరుగులు చేసిన కోహ్లీ.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో 13 ఫోర్లు, ఓ సిక్సర్ ఉంది.

కోహ్లీ ఐపీఎల్ సెంచరీలు..

- 2016లో గుజరాత్ లయన్స్‌పై కోహ్లీ సెంచరీ(100)

- 2016లో రైజింగ్ పుణెపై శతకం(108)

- 2016లో గుజరాత్ లయన్స్‌పై సెంచరీ(109)

- 2016లో పంజాబ్‌పై శతకం(113)

-2019లో కోల్‌కతాపై సెంచరీ(100)

- 2023లో హైదరాబాద్‌పై సెంచరీ(100)

- 2023లో గుజరాత్ టైటాన్స్‌పై సెంచరీ(101)

అంతేకాకుండా కోహ్లీ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 229 ఇన్నింగ్సుల్లో 37.25 సగటుతో 7263 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు(973) చేసిన ఆటగాడిగానూ రికార్డు దక్కించుకున్నాడు. ఓ సీజన్‌లో అత్యధిక సెంచరీలు(4) సాధించిన ప్లేయర్‌గా సంయుక్తంగా బట్లర్‌తో కలిసి పంచుకున్నాడు.

WhatsApp channel