Virat Kohli Vs Naveen Ul Haq : విరాట్ కోహ్లీకి నవీన్ ఉల్ హక్.. సారీ చెప్పాడా?
Virat Kohli Vs Naveen Ul Haq : ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ, లక్నో ఆటగాడు నవీన్ ఉల్ హక్ మధ్య జరిగిన వాగ్వాదం ఇంకా చల్లారడం లేదు. ఆటగాళ్లు వదిలి పెట్టినా.. ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని వదలడం లేదు. అయితే కోహ్లీకి నవీన్ ఉల్ హక్.. క్షమాపణలు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
లక్నో సూపర్‌జెయింట్స్(Lucknow Super Giants) ఆటగాడు నవీన్ ఉల్ హక్‌ను RCB అభిమానులు ప్రతి మ్యాచ్ లక్ష్యంగా చేసుకున్నారు. లక్నో ఆటగాళ్లు వెళ్తుంటే కూడా కోహ్లీ.. కోహ్లీ.. అని అరిచేవారు. ఇలాంటి వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి. విరాట్ కోహ్లీ(Virat Kohli)తో వాగ్వాదం తర్వాత నవీన్ ఉల్ హక్(Naveen Ul Haq) ఇబ్బందుల్లో పడ్డాడు. మే 1న లక్నోలో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో లక్నో పేసర్ నవీన్ ఉల్, విరాట్ కోహ్లీ మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత షేక్ హ్యాండ్ ఇస్తూ కోహ్లీ చేయి లాగాడు నవీన్. ఇది ఆర్సీబీ అభిమానులకు అస్సలు నచ్చలేదు.
ఈ దారుణమైన ప్రవర్తనతో ఆగ్రహించిన RCB అభిమానులు ప్రతి మ్యాచ్‌లో నవీన్-ఉల్-హక్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో నవీన్ ఉల్ హక్ అయోమయంలో పడ్డాడు. సోషల్ మీడియాలో కూడా కింగ్ కోహ్లీ అభిమానులు అఫ్గాన్ ఆటగాడికి కొన్నిసార్లు పిచ్చెక్కించారు. ఐపీఎల్ లో ఓటమితో లక్నో ఇంటికి వెళ్లింది.
దీని తర్వాత, విరాట్ కోహ్లీకి నవీన్ ఉల్ హక్ క్షమాపణలు చెప్పిన ట్విట్టర్ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నవీన్ ఉల్ హక్ అనే అకౌంట్ చేసిన ఈ ట్వీట్ ప్రామాణికతను పరిశీలిస్తే అది ఫేక్ అకౌంట్ అని తెలిసింది. ఎందుకంటే నవీన్ ఉల్ హక్ అసలు ట్విట్టర్ ఖాతా పేరు నవీన్ ఉల్ హక్ మురిద్. అయితే ఇప్పుడు నవీన్ ఉల్ హక్ అనే ఫేక్ అకౌంట్ ద్వారా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయింది. విరాట్ కోహ్లీకి నవీన్ ఉల్ హక్ క్షమాపణలు చెప్పలేదు. ఇప్పుడు కింగ్ కోహ్లీ(King Kohli) అభిమానులు ఆసియా కప్‌లో నవీన్ ఉల్ హక్, విరాట్ కోహ్లీల మధ్య ఎలా ఉంటుందని ఎదురు చూస్తున్నారు.
నవీనుల్ హక్ బౌలింగ్ కు దిగిన ప్రతిసారీ ప్రేక్షకులు కోహ్లీ జపం చేశారు. అయితే మ్యాచ్ తర్వాత దీనిపై నవీనుల్ స్పందించాడు. నిజానికి కోహ్లీ అంటూ వాళ్లు చేసిన నినాదాలను తాను ఎంజాయ్ చేసినట్లు అతడు చెప్పడం విశేషం.
'దానిని నేను ఎంజాయ్ చేశాను. గ్రౌండ్ లో అందరూ అతని పేరు లేదంటే మరే ప్లేయర్ పేరుతో అరిచినా నాకు నచ్చింది. నా జట్టు కోసం మరింత బాగా ఆడాలన్న తపన నాలో అది కలగజేస్తుంది. బయటి అరుపులను నేను పెద్దగా పట్టించుకోను. నా క్రికెట్ పైనే నేను దృష్టిసారిస్తాను. ఫ్యాన్స్ అరుస్తున్నారా లేదంటే ఎవరైనా ఏదైనా అంటున్నారా అన్నది నాపై ప్రభావం చూపదు. ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ గా అవన్నీ పట్టించుకోకూడదు.' అని నవీనుల్ స్పష్టం చేశాడు.