Aditi Rao Hydari on Rumours: సిద్ధార్థ్‌తో డేటింగ్‌పై స్పందించిన అదితి.. సిగ్గు పడుతూ మరీ క్లారిటీ ఇచ్చిన బ్యూటీ..!-aditi rao hydari finally responds to relationship rumours with siddharth ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aditi Rao Hydari On Rumours: సిద్ధార్థ్‌తో డేటింగ్‌పై స్పందించిన అదితి.. సిగ్గు పడుతూ మరీ క్లారిటీ ఇచ్చిన బ్యూటీ..!

Aditi Rao Hydari on Rumours: సిద్ధార్థ్‌తో డేటింగ్‌పై స్పందించిన అదితి.. సిగ్గు పడుతూ మరీ క్లారిటీ ఇచ్చిన బ్యూటీ..!

Maragani Govardhan HT Telugu
May 22, 2023 12:02 PM IST

Aditi Rao Hydari on Rumours: ప్రముఖ హీరో, హీరోయిన్లు సిద్ధార్థ్-అదితి రావ్ హైదరీ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై సదరు హీరోయిన్ అదితి స్పందించింది. సిగ్గుపడుతూ మరి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.

సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ
సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ

Aditi Rao Hydari on Rumours: ప్రముఖ హీరోయిన్ అదితి రావ్ హైదరీ.. హీరో సిద్ధార్థ్‌తో డేటింగ్ చేస్తుందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని చాలా చోట్లా కనిపించారు. శర్వానంద్ నిశ్చితార్థానికి కూడా కలిసి హాజరయ్యారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ విషయంపై వీరిద్దరూ ఇంతవరకు ఎక్కడా స్పందించలేదు. ఎప్పుడు అడిగినా ఆ ప్రశ్నను దాటవేస్తూ వచ్చారు. ఎట్టకేలకు అదితి తన రిలేషన్ గురించి నోరు విప్పింది.

yearly horoscope entry point

ఫ్యాన్స్‌తో ఇంటరాక్షన్ సందర్భంగా మాట్లాడిన అదితిని ఓ అభిమాని సిద్ధార్థ్‌తో ప్రేమ గురించి అడిగాడు. వెంటనే తన ముఖాన్ని రెండు చేతులతో కప్పుకుంటూ సిగ్గులు ఒలకబోసింది. అనంతరం తన పెదాలను జిప్‌ వేస్తున్నట్లు సంజ్ఞ చేస్తూ ఆ ప్రశ్నను దాట వేసింది. దీన్ని బట్టి చూస్తుంటే ఈ విషయం గురించి తాను మాట్లాడుకోదలచుకోలేదని ఆమె సంకేతంతో తెలుస్తోంది. ఇదే సమయంలో సిద్ధార్థ్‌తో ప్రేమపై క్లారిటీ కూడా ఇచ్చినట్లు అర్థమవుతుంది.

తాను, సిద్ధార్థ్ మంచి స్నేహితులం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చేసింది. అయితే ఆమె సిగ్గుపడి సమాధానం దాట వేయడంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నట్లేనని నెటిజన్లు తమ స్పందనను తెలియజేస్తున్నారు. మహా సముద్రం సినిమా చేసే సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతా చాలా సార్లు కలిసి కనిపించారు. అంతేకాకుండా జూబ్లీ స్క్రీనింగ్‌కు కూడా సిద్ధార్థ్ హాజరయ్యాడు. ముంబయిలో పలుమార్లు బ్రేక్ ఫాస్ట్, లంచ్ డేట్లలో కలిశారు. అంతేకాకుండా ఏఆర్ రెహమాన్ కుమార్తే రిసెప్షన్‌కు కూడా హాజరయ్యారు.

ప్రస్తుతం సిద్ధార్థ్ టక్కర్ అనే సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. మరోపక్క అదితి రావ్ హైదరీ ఇటీవలే జూబ్లీ సిరీస్‌తో సందడి చేసింది. ఇది కాకుండా గాంధీ టాక్స్ అనే సినిమా కూడా చేస్తోంది.

Whats_app_banner