ఈ పాన్‌ ఇండియా ఏంటి.. నాన్సెన్స్‌ కాకపోతే.. నటుడు సిద్ధార్థ్‌ సంచలన కామెంట్స్‌-pan india is disrespectful word says actor siddharth ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఈ పాన్‌ ఇండియా ఏంటి.. నాన్సెన్స్‌ కాకపోతే.. నటుడు సిద్ధార్థ్‌ సంచలన కామెంట్స్‌

ఈ పాన్‌ ఇండియా ఏంటి.. నాన్సెన్స్‌ కాకపోతే.. నటుడు సిద్ధార్థ్‌ సంచలన కామెంట్స్‌

HT Telugu Desk HT Telugu
May 01, 2022 04:39 PM IST

నటుడు సిద్ధార్థ్‌ మరోసారి సంచలన కామెంట్స్‌ చేశాడు. ప్రస్తుతం పాన్‌ ఇండియా పేరుతో వస్తున్న సినిమాల గురించి స్పందిస్తూ.. ఈ పాన్‌ ఇండియా అనే పదమేంటి? నాన్సెన్స్‌ అని అన్నాడు.

<p>నటుడు సిద్ధార్థ్</p>
నటుడు సిద్ధార్థ్ (Twitter)

పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2.. నాలుగు నెలల కాలంలో వచ్చిన ఈ మూడు సినిమాలు పాన్‌ ఇండియా అంటూ వివిధ భాషల్లో రిలీజై సంచలన విజయం సాధించాయి. సినీ ఇండస్ట్రీలో ఈ పాన్‌ ఇండియా అనే ఓ కొత్త పదం పుట్టుకొచ్చిందని, ఇక సౌత్‌ సినిమాలు హిందీ బెల్ట్‌లోనూ దుమ్మురేపుతాయని మనోళ్లు ఫుల్‌ ఖుషీ అయిపోయారు. అయితే మన సౌత్‌ యాక్టర్‌ సిద్ధార్థ్‌కు మాత్రం ఈ పాన్‌ ఇండియా అనే పదం అస్సలు నచ్చలేదు. ఇది ప్రాంతీయ భాషా సినిమాలను అగౌరవపరిచే పదమని అతను అంటున్నాడు.

ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌ నుంచి వస్తుంది.. పాన్‌ ఇండియా సినిమా అంటే సౌత్‌ నుంచి వస్తుందన్న భావన దీనివల్ల కలుగుతోందని, అసలు ఏ సినిమా అయినా ఇండియన్‌ సినిమాయే అవుతుందని సిద్ధార్థ్‌ స్పష్టం చేశాడు. తాను 15 ఏళ్ల కిందట ఇంటర్వ్యూలు ఇచ్చే సమయంలో క్రాస్‌ఓవర్‌ సినిమా అనే టాపిక్‌ నడిచేదని, హాలీవుడ్‌ రేంజ్‌కు ఎప్పుడు చేరుకుంటామని అడిగేవారని గుర్తు చేసుకున్నాడు.

అయితే తాను మాత్రం క్రాస్‌ ఓవర్‌ ఎందుకు.. కనీసం ఇండియాలోనే క్రాస్‌ ఓవర్‌ ఎందుకు చేయరు? మీరు ఇక్కడే ఇతర భాషల్లో సినిమాలు ఎందుకు చూడరు? ముందు ఇండియన్‌ సినిమాలను ఇండియన్‌ సినిమాలుగా ఎందుకు చూడరు అని తాను ప్రశ్నించినట్లు సిద్ధార్థ్‌ చెప్పాడు. "అందుకే వీళ్లు పాన్‌ ఇండియా ఓ కొత్త కామెడీతో ముందుకు వచ్చారు. ఈ పదం చాలా అగౌరవకరమైనది. దీనివల్ల ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌ నుంచి వస్తుంది. పాన్‌ ఇండియా అంటే ప్రాంతీయ భాష నుంచి వస్తుందనే భావన కలుగుతుంది" అని సిద్ధార్థ్‌ అన్నాడు.

15 ఏళ్ల కిందట పాన్‌ ఇండియా సినిమాలు లేవా అని ఎదురు ప్రశ్నించాడు. "నా బాస్‌ మణిరత్నం రోజా అనే సినిమా తీశాడు. ఆ సినిమా ఇండియా మొత్తం చూసింది. కానీ దానిని ఎవరూ పాన్‌ ఇండియా సినిమా అని పిలవలేదు. ఇప్పుడు కన్నడలో కేజీఎఫ్‌ తీశారు. ఆ సినిమాను ఏ భాషలో అయినా చూడొచ్చు. అది కన్నడ ఇండస్ట్రీలో తీసిన ఓ ఇండియన్‌ సినిమా" అని సిద్ధార్థ్‌ చెప్పడం విశేషం. అసలు పాన్‌ ఇండియా అనే పదాన్ని తొలగించాలని అన్నాడు.

Whats_app_banner