Siddharth and Aditi Lunch Date: లంచ్ డేట్‌కు వెళ్లిన ప్రేమ పక్షులు..! కెమెరా కంటికి చిక్కిన సిద్ధార్థ్-అదితి-siddharth and aditi rao hydari on lunch date in mumbai
Telugu News  /  Entertainment  /  Siddharth And Aditi Rao Hydari On Lunch Date In Mumbai
సిద్ధార్థ్-అదితి రావ్ హైదరీ
సిద్ధార్థ్-అదితి రావ్ హైదరీ

Siddharth and Aditi Lunch Date: లంచ్ డేట్‌కు వెళ్లిన ప్రేమ పక్షులు..! కెమెరా కంటికి చిక్కిన సిద్ధార్థ్-అదితి

22 February 2023, 7:11 ISTMaragani Govardhan
22 February 2023, 7:11 IST

Siddharth and Aditi Lunch Date: హీరో సిద్ధార్థ్ ప్రస్తుతం హీరోయిన్ అదితి రావ్ హైదరీతో డేటింగ్‌లో ఉన్నాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని బలపరుస్తూ చాలాసార్లు వీరిద్దరూ మీడియాకు చిక్కారు. తాజాగా మరోసారి కెమెరా కంటికి చిక్కారు. ఇద్దరూ లంచ్ డేట్‌కు వెళ్లారు.

Siddharth and Aditi Lunch Date: సౌత్ స్టార్ సిద్ధార్థ్‌కు రిలేషన్‌షిప్‌లు కొత్తేమి కాదు. ఇప్పటికే పలువురు ముద్దుగుమ్మలతో ప్రేమాయణం నడిపించిన అతడు.. ప్రస్తుతం అదితి రావ్ హైదరీతో పీకల్లోతూ ప్రేమలో మునిగి తేలుతున్నాడు. మహాసముద్రం సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ అప్పటి నుంచి తమ రిలేషన్‌ను కొనసాగిస్తున్నారు. అయితే ఇంతవరకు వీరిద్దరూ ఈ అంశంపై బహిరంగంగా నోరు మెదపనప్పటికీ.. చాలా సార్లు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపించారు. తాజాగా మరోసారి కెమెరా కంటికి చిక్కారు. ఇటీవల ముంబయిలోని ఓ రెస్టారెంటుకు లంచ్ డేట్‌కు వెళ్తూ కనిపించారు.

ఒకే కారులో నుంచి రెస్టారెంటుకు విచ్చేసిన సిద్ధార్థ్-అదితి మీడియాకు చిక్కారు. సిద్ధార్థ్ పట్టించుకోకుండా లోపలకు వెళ్లగా.. అదితి మాత్రం కెమెరాకు ఫోజులిచ్చింది. పింక్ కలర్ షర్ట్, బ్రౌన్ కలర్ ప్యాంటులో దర్శన మివ్వగా.. సిద్ధార్థ్ మాత్రం మాస్క్ ధరించి క్యాజువల్ దుస్తుల్లో మెరిశారు. వీరి రాకతో బీటౌన్ మీడియా తమ కెమెరాలకు పనిచెప్పారు.

ఇద్దరూ కలిసి కెమెరాకు ఫోజివ్వాలని విలేకరులు అడుగ్గా.. ఆయన వెళ్లిపోయాడు అంటూ సిద్ధార్థ్ గురించి అదితి చెప్పింది. అయితే అదితి మాత్రం కొన్ని ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.

సిద్ధార్థ్-అదితి ఇద్దరూ కలిసి మహాసముద్రం సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలో శర్వానంద్ కూడా ప్రధాన పాత్ర పోషించాడు. ఆ చిత్రంలో పనిచేస్తున్నప్పుడు సిద్ధార్ధ్-అదితి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని తమ రిలేషన్‌ను ప్రారంభించారని తెలుస్తోంది. ఇటీవలే శర్వానంద్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్‌కు కూడా వీరిద్దరూ కలిసి హాజరయ్యారు. అంతేకాకుండా వీలుచిక్కినప్పుడల్లా వీరిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగడం, వెకేషన్ ప్లాన్ చేసుకుంటున్నారు.

సినిమాల విషయానికొస్తే అదితి రావ్ ప్రస్తుంత నెట్‌ఫ్లిక్స్ సిరీస్ హీరామండీలో నటిస్తోంది. ఈ సిరీస్‌ను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నారు. మరో పక్క సిద్ధార్థ్ కూడా శంకర్-కమల్ హాసన్ కాంబోలో వస్తున్న ఇండియన్-2 చిత్రంలో అవకాశం దక్కించుకున్నాడు. ఇందులో కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.

సంబంధిత కథనం