Trolls On Tamannah : తమన్నా.. మరో సన్నీ లియోన్ అవుతోంది.. మిల్కీ బ్యూటీపై ఫ్యాన్స్ ఫైర్-tamannah bhatia trolled by fans for her steamy scenes in jee karda ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Trolls On Tamannah : తమన్నా.. మరో సన్నీ లియోన్ అవుతోంది.. మిల్కీ బ్యూటీపై ఫ్యాన్స్ ఫైర్

Trolls On Tamannah : తమన్నా.. మరో సన్నీ లియోన్ అవుతోంది.. మిల్కీ బ్యూటీపై ఫ్యాన్స్ ఫైర్

Anand Sai HT Telugu
Jun 16, 2023 02:29 PM IST

Trolls On Tamannah : నటి తమన్నాపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. తాజాగా విడుదలైన జీ కర్దా వెబ్ సిరీస్ ఇందుకు కారణం. అందులో ఆమె చేసిన అడల్ట్ కంటెంట్ మీద సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

తమన్నా
తమన్నా

తమన్నా భాటియా(Tamannah Bhatia) అభిమానులు జూన్ నెల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆమె నటించిన రెండు వెబ్ సిరీస్ లు ఈ నెలలో విడుదల ఉంది. ఇప్పటికే జూన్ 15 నుండి జీ కర్దా(Jee Karda) ప్రైమ్ వీడియోలలో స్ట్రీమింగ్ అవుతుండగా, లస్ట్ స్టోరీస్ 2(Lust Stories 2) జూన్ 29 నుండి ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే చాలా మంది తమన్నా అభిమానులు జీ కర్దాను వీక్షించారు. అయితే దీనిపై భిన్న రకాలుగా స్పందన వస్తుంది. తమన్నా నటించిన కొన్ని సీన్లపై ఫ్యాన్స్ దారుణంగా విమర్శలు చేస్తున్నారు.

yearly horoscope entry point

ఏడుగురు పాఠశాల స్నేహితుల గురించిన కథ జీ కర్దా. ఈ వెబ్ సిరీస్ లో తమన్నా, ఆషిమ్ గులాటీ నటించిన కొన్ని సీన్లపై ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అడల్ట్ కంటెంట్ లో తమన్నా నటించడం ఏంటని మండిపడుతున్నారు. సోషల్ మీడియా(Social Media)లో తమన్నాను ట్రోల్స్ చేస్తున్నారు. తమన్నా తన సినిమా కెరీర్ లో ముద్దు పెట్టుకోవద్దనే నిబంధనను పెట్టుకుంది. ఇప్పటి వరకూ ఆ నిబంధనను పాటిస్తూ వచ్చింది. జీ కర్దాలోనూ రోమాన్స్ ఎంత చేసినా.. లిప్ లాక్ చేసినట్టుగా ఎక్కడా కనిపించలేదు. లస్ట్ స్టోరీస్ 2లో ముద్దు పెట్టుకోనుంది మిల్కీ బ్యూటీ. ఏది ఏమైనా.. ఫ్యాన్స్ మాత్రం.. మరీ అంతలా రోమాన్స్ చేయడంపై విరుచుకుపడుతున్నారు. కామెంట్స్ మాత్రం దారుణంగా చేస్తున్నారు.

18 ఏళ్ల కెరీర్లో అందాలు ఆరబోసినా కూడా ఎప్పుడూ ఇంటిమేట్ సీన్లు, కిస్సింగ్ సీన్లలో తమన్నా నటించలేదు. తాజాగా ఇప్పుడు ఆమె ఇలా నటిస్తుండటాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. తనకు తాను పెట్టుకున్న కిస్ నిబంధనను లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా గాలికొదిలేసింది. తన రియల్ లైఫ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మకు రీల్ లో ముద్దు పెట్టనుంది.

బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ వర్మ(Vijay Varma)తో తమన్నా పేరు కొద్ది రోజులుగా వినిపిస్తోంది. వారిద్దరూ కొన్ని చోట్ల కలిసి కనిపించారు. దీంతో ఇద్దరి మధ్య ఏదో ఉందని.. గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు నటి తమన్నా తనకు, విజయ్ వర్మ(Tamanna Vijay Varma)కు మధ్య ప్రేమను అంగీకరించింది. తాను విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నానని చెప్పింది. 'ఒకరు నాతో నటించారని ఆకర్షణ ఉండదు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది నటీనటులతో నటించాను. నేను ఎవరికీ ఆకర్శితురాలిని కాలేదు. మీకు నిజంగా ఒకరిపై క్రష్ ఉంటే, భావాలు చాలా ప్రైవేట్‌గా ఉంటాయి. ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, ఏం చేస్తున్నాడు, సక్సెస్ ఫుల్ పర్సన్ కాదా అనేది లెక్కలోకి తీసుకోరు.' అని తమన్నా చెప్పుకొచ్చింది.

ఇంకా మాట్లాడుతూ, విజయ్ వర్మను 'నా ఆనంద నిధి' అని అభివర్ణించింది. మా సంబంధం ఎటువంటి ఒత్తిడి లేకుండా చాలా సహజంగా ప్రారంభమైందని తెలిపింది. వారిద్దరు కలిసి నటించిన లస్ట్ స్టోరీస్ 2(lust stories 2) సినిమా సెట్స్‌లోనే తన ప్రేమ ప్రారంభమైందని తమన్నా పేర్కొంది. అయితే కొద్దిరోజుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో తన గురించి, విజయ్ గురించిన వార్తల గురించి మాట్లాడుతూ.. దాని గురించి నేను క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. అయితే ఇప్పుడు మాత్రం తనకు, విజయ్‌కి మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ను మిల్కీ బ్యూటీ అంగీకరించింది.

Whats_app_banner