Tamannaah on Baahubali: బాహుబలిలాంటి సినిమాలతో హీరోలకే పేరొస్తుంది: తమన్నా
Tamannaah on Baahubali: బాహుబలిలాంటి సినిమాలతో హీరోలకే పేరొస్తుందని తమన్నా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మూవీతో ప్రభాస్ కు వచ్చిన పేరు తనకు రాకపోవడంపై ఆమె ఇలా స్పందించింది.
Tamannaah on Baahubali: బాహుబలి మూవీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సంచలనం క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఈ సినిమాతో ప్రభాస్, రానా పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు. డైరెక్టర్ రాజమౌళి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషించిన తమన్నాకు మాత్రం బాహుబలి వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు.
దీనిపై ఆమె తాజాగా స్పందించింది. ఇలా యాక్షన్ ఫిల్మ్స్ వల్ల తమ కంటే మేల్ యాక్టర్స్ కే ఎక్కువ పేరొస్తుందని చెప్పింది. అయితే దానికి ప్రభాస్, రానా అర్హులని కూడా తమన్నా అనడం విశేషం. "యాక్షన్ సినిమాలలో క్రెడిట్ మొత్తం మేల్ యాక్టర్స్ కే వెళ్తుందని నాకు అనిపిస్తుంది. అయితే ఈ సినిమా ద్వారా ప్రభాస్, రానాలకు వచ్చిన పేరుకు వారు అర్హులు. నాకు తగిన గుర్తింపు రాకపోవడానికి అందులో నా పాత్ర ఓ స్థాయికి పరిమితం కావడం కూడా కారణమే" అని తమన్నా అభిప్రాయపడింది.
ఫిల్మ్ కంపానియన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా ఈ కామెంట్స్ చేసింది. బాహుబలి మూవీతో ప్రభాస్ కు నార్త్ లోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ సినిమా తర్వాత అతడు అన్నీ పాన్ ఇండియా లెవల్ సినిమాలే తీస్తున్నాడు. ఇప్పుడు ఆదిపురుష్ మూవీతో మరోసారి పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అటు రానా కూడా అంతకుముందు నుంచే బాలీవుడ్ లో ఉన్నా కూడా బాహుబలిలో తన విలనిజంతో మరింత పేరు సంపాదించాడు. తన పాత్రకు తగిన గుర్తింపు రాకపోయినా.. బాహుబలి ద్వారా తనను ఆదరించిన ప్రేక్షకులకు తమన్నా థ్యాంక్స్ చెప్పింది. ప్రస్తుతం తమన్నా టాలీవుడ్ కు దూరంగా ఉంది. లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా అనే రెండు వెబ్ సిరీస్ లలో ఆమె నటిస్తోంది. రజనీకాంత్ తో జైలర్, చిరంజీవితో భోళా శంకర్ సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు ఆగస్ట్ 11న రిలీజ్ కానున్నాయి.
సంబంధిత కథనం