Prabhas Adipurush: తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటా - ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ కామెంట్స్
Prabhas Adipurush: ఇకపై ఏడాదికి రెండు లేడా మూడు సినిమాలు చేస్తానని ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభిమానులకు మాటిచ్చాడు ప్రభాస్. ఈ వేడుకలో తన పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
Prabhas Adipurush: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన పెళ్లిపై ప్రభాస్ ఆసక్తికరంగా కామెంట్స్ చేశాడు. మంగళవారం ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున తిరుపతిలో జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫైనల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ వేడుకలో ప్రభాస్ మాట్లాడుతోండగా అభిమానులు ఆయన్ని పెళ్లెప్పుడూ అని అడిగారు. అభిమానుల ప్రశ్నకు ప్రభాస్ సమాధానం ఇచ్చాడు. తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటానని అన్నాడు. అతడి సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఒక్కొక్కరు ఇరవై గంటలు పనిచేశారు...
"ఈ సినిమా ట్రైలర్‌ను తొలుత ఫ్యాన్స్‌కే చూపించాలని అనుకున్నాం. వారి రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉత్సాహంగా ఎదురుచూశాం. త్రీడీ ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో మంచి సినిమా చేయడానికి ఓంరౌత్ టీమ్ దాదాపు ఎనిమిది నెలలు సరిగ్గా నిద్రపోకుండా కష్టపడి పనిచేశారు. ఆదిపురుష్ కోసం ఓ యుద్ధమే చేశారని" ప్రభాస్ అన్నాడు.
ఓ సందర్భంలో “చిరంజీవిగారు కలిసి రామాయణం చేస్తున్నావా అని నన్ను అడిగారు. ఆయన ప్రశ్నకు అవునని సమాధానం చెప్పాను. ఈ అదృష్టం అందరికి దొరకదు. నీకు దొరికిందని చిరంజీవిగారు నాతో అన్నారని” ప్రభాస్ పేర్కొన్నాడు. ఆదిపురుష్ ఆరంభంలో చాలా కష్టాలు పడ్డాం. వాటిని ఎదురించడానికి ఓంరౌత్ టీమ్ పెద్ద పోరాటమే చేసిందని ప్రభాస్ చెప్పాడు. సీత పాత్రలో కృతిసనన్ అద్భుతంగా నటించిందని ప్రభాస్ అన్నారు. ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో అందరిని ఫిదా చేసిందని పేర్కొన్నాడు.
ప్రస్తుతం ఇదివరకంటే ఎక్కువగా సినిమాలు చేస్తున్నానని, అందుకే ఈ వేడుకలో ఎక్కువగా మాట్లాడానని ప్రభాస్ అన్నాడు. ఇకపై తక్కువ మాట్లాడి ఎక్కువ సినిమాలు చేస్తానని పేర్కొన్నాడు. ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని అభిమానులకు మాటిచ్చాడు. కుదిరితే మూడు సినిమాలు కూడా చేస్తానని అన్నాడు. ఒకవేళ సినిమాలు లేటయితే తనకు సంబంధం లేదని అంటూ ప్రభాస్ చెప్పడం ఆసక్తికరంగా మారింది.
తెలుగుకు సంబంధించి ఇదే లాస్ట్ పబ్లిసిటీ ఈవెంట్ అని ప్రభాస్ ఈ వేడుకలో పేర్కొన్నాడు. అందుకే ప్రీ రిలీజ్ వేడుకను దాదాపు రెండు కోట్ల బడ్జెట్‌తో భారీగా నిర్వహించినట్లు తెలిసింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కృతిసనన్, ఓంరౌత్, భూషణ్‌కుమార్‌తో పాటు సినిమా యూనిట్ మొత్తం పాల్గొన్నారు. చినజీయర్ స్వామి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.
టాపిక్