Intinti Ramayanam Teaser: నవ్వించే ఇంటింటి రామాయణం.. టీజర్‌ రిలీజ్‌-intinti ramayanam teaser out as this funny family ride connects all ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Intinti Ramayanam Teaser Out As This Funny Family Ride Connects All

Intinti Ramayanam Teaser: నవ్వించే ఇంటింటి రామాయణం.. టీజర్‌ రిలీజ్‌

HT Telugu Desk HT Telugu
Nov 25, 2022 01:40 PM IST

Intinti Ramayanam Teaser: కడుపుబ్బా నవ్వించే ఇంటింటి రామాయణం టీజర్‌ వచ్చేసింది. ఆహా ఓటీటీలోకి రానున్న ఈ వెబ్‌ మూవీ టీజర్‌ను మేకర్స్‌ శుక్రవారం (నవంబర్‌ 25) రిలీజ్‌ చేశారు.

ఇంటింటి రామాయణంలో రాహుల్ రామకృష్ణ, నరేష్, నవ్యా స్వామి తదితరులు
ఇంటింటి రామాయణంలో రాహుల్ రామకృష్ణ, నరేష్, నవ్యా స్వామి తదితరులు

Intinti Ramayanam Teaser: ఆహా ఓటీటీ తనదైన స్టైల్లో తెలుగు వెబ్‌సిరీస్‌, మూవీస్‌తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ ఓటీటీ మరోసారి ఓ కామెడీ వెబ్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ సినిమా ద్వారా తొలిసారి ఓటీటీలో అడుగుపెడుతోంది. ఇంటింటి రామాయణం పేరుతో వస్తున్న ఈ మూవీ టీజర్ శుక్రవారం రిలీజైంది.

కడుపుబ్బా నవ్వించేలా ఉన్న ఈ టీజర్‌ మూవీపై అంచనాలు పెంచింది. ఐవీ ప్రొడక్షన్స్‌, మారుతి టీమ్‌తో కలిసి సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ ఇంటింటి రామాయణాన్ని తెరకెక్కించింది. సురేశ్‌ నారెడ్ల ఈ మూవీకి కథ, దర్శకత్వం వహించాడు. ఓ కుటుంబం చుట్టూ తిరిగే ఫన్నీ స్టోరీ ఇది. రాహుల్‌ రామకృష్ణ, నరేష్‌లాంటి నటులు ఉండటం ఈ మూవీకి ప్లస్‌ పాయింట్‌.

తెలంగాణ గ్రామీణ జీవితాన్ని ఇందులో చూపించినట్లు టీజర్‌ చూస్తే తెలుస్తోంది. కరీంనగర్‌లో జరిగే కథ ఇది. ఇందులో రాములు అనే క్యారెక్టర్‌లో నరేష్‌ కనిపించాడు. అతని ఫ్యామిలీ కథే ఈ ఇంటింటి రామాయణం. ఓ సాధారణ మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ రోజువారీ జీవితంలో ఎదుర్కొనే కష్టాలనే ప్రధాన కథాంశంగా ఈ మూవీని తెరకెక్కించారు.

టీజర్‌ అయితే ఫన్నీగా సాగిపోయింది. డిసెంబర్‌ 16న ఆహా ఓటీటీలోకి ఇంటింటి రామాయణం రాబోతోంది. అన్ని ఎమోషన్స్‌ కలగలిపిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేలానే ఉంది.

మీరసలు హైలైట్‌ అన్నా.. మీ అసుంటి గొప్ప ఫ్యామిలీ ఏ ఊళ్లో కూడా ఉండదు తెలుసా అనే బ్యాక్‌గ్రౌండ్‌ వాయిస్‌తో ఈ టీజర్‌ మొదలవుతుంది. అసలు ఏం ఫ్యామిలీ రా మీది.. ఒక్కొక్కడికి ఒక్కో చరిత్ర ఉంది అని పోలీస్‌ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌ డైలాగ్‌తో ముగుస్తుంది. మొత్తానికి టీజర్‌ మూవీపై ఆసక్తి రేపేలా సాగింది.

IPL_Entry_Point

టాపిక్