Rana on Project K: బాహుబలి, ఆర్ఆర్ఆర్‌ చేయలేనిది ప్రాజెక్ట్ కే చేస్తుంది: రానా-rana on project k says it will be a global film from telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rana On Project K Says It Will Be A Global Film From Telugu

Rana on Project K: బాహుబలి, ఆర్ఆర్ఆర్‌ చేయలేనిది ప్రాజెక్ట్ కే చేస్తుంది: రానా

Hari Prasad S HT Telugu
Jun 02, 2023 10:01 AM IST

Rana on Project K: బాహుబలి, ఆర్ఆర్ఆర్‌ చేయలేనిది ప్రాజెక్ట్ కే చేస్తుందని అన్నాడు రానా దగ్గుబాటి. ప్రభాస్ నటిస్తున్న సైంటిఫిక్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీపై రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ప్రాజెక్ట్ కే మూవీ
ప్రాజెక్ట్ కే మూవీ

Rana on Project K: టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి.. ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే (Project K) మూవీపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మూవీ తెలుగు నుంచి తొలి గ్లోబల్ ఫిల్మ్ గా నిలుస్తుందని అనడం విశేషం. ఈ సినిమా గురించి తాను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో రానా ఈ సినిమాపై స్పందించాడు.

"సౌతిండియాలో మేము ఒకరి సినిమాలను మరొకరం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడో మూవీ వస్తోంది. దాని పేరు ప్రాజెక్ట్ కే. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్, దీపికా, అమితాబ్ బచ్చన్ నటిస్తున్న సినిమా అది. తెలుగులో ఆ సినిమా కోసం మేము చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం.

ఈ మూవీ సరిహద్దులను చెరిపేస్తుంది. ఇప్పటి వరకూ బాహుబలి, ఆర్ఆర్ఆర్ కు సాధ్యం కాని పని అది. నేను కూడా ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. ప్రాజెక్ట్ కే తెలుగు నుంచి ఓ గ్లోబల్ ఫిల్మ్ అవుతుందని నేను అనుకుంటున్నాను" అని రానా అనడం విశేషం.

వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీలో దీపికా పదుకోన్ తోపాటు మరో బాలీవుడ్ నటి దిశా పటానీ కూడా కీలకపాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మూవీ ఇది.

ప్రభాస్, దీపికా పదుకోన్ జంటగా నటిస్తున్న 'ప్రాజెక్ట్ K' చిత్రాన్ని జనవరి 12, 2024న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. దీనికి సంబంధించి పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే ఈ లెక్క.. రివర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

షూటింగ్ ఆలస్యమైతే.. విడుదల తేదీ కూడా మారనుంది. కొన్ని రోజుల కిందట అమితాబ్ బచ్చన్ గాయపడ్డాడు. ఆయన కోలుకోవడం ఆలస్యమవడంతో సినిమా పనులు ఆలస్యమయ్యాయి. దీంతో ' ప్రాజెక్ట్ K ' సినిమా అనుకున్న తేదీకి విడుదల అవడం కష్టమేనని అంటున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం