తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Baak Release: అయ్యయ్యో.. తమన్నా రాశీ ఖన్నా తమిళ హారర్ మూవీకి కష్టాలు.. ఏమైందంటే?

Baak Release: అయ్యయ్యో.. తమన్నా రాశీ ఖన్నా తమిళ హారర్ మూవీకి కష్టాలు.. ఏమైందంటే?

Sanjiv Kumar HT Telugu

20 April 2024, 11:22 IST

  • Tamanna Raashi Khanna Baak Postponed: తమన్నా రాశీ ఖన్నా నటించిన కోలీవుడ్ హారర్ కామెడీ మూవీ బాక్ వాయిదా పడింది. ఆ కష్టాల కారణంగా బాక్ కొత్త రిలీజ్ డేట్‌ను తాజాగా మేకర్స్ ప్రకటించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

అయ్యయ్యో.. తమన్నా రాశీ ఖన్నా తమిళ హారర్ మూవీకి కష్టాలు.. ఏమైందంటే?
అయ్యయ్యో.. తమన్నా రాశీ ఖన్నా తమిళ హారర్ మూవీకి కష్టాలు.. ఏమైందంటే?

అయ్యయ్యో.. తమన్నా రాశీ ఖన్నా తమిళ హారర్ మూవీకి కష్టాలు.. ఏమైందంటే?

Tamanna Raashi Khanna Baak New Release Date: తమ అందాలను ఎరగా వేసి హాట్ ట్రీట్‌తో పాటు భయపెట్టేందుకు వస్తున్నారు ముద్దుగుమ్మలు తమన్నా అండ్ రాశీ ఖన్నా. మిల్కీ బ్యూటి తమన్నా, బ్యూటిఫుల్ రాశీ ఖన్నా రెండోసారి కలిసి నటించిన సినిమా బాక్. తమిళంలో అరణ్‌మనై 4గా వస్తున్న ఈ సినిమాను తెలుగులో బాక్ పేరుతో విడుదల చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

OTT Movies To Watch: ఓటీటీలో ఈ వారం ఈ 4 మిస్ అవ్వొద్దు.. దేని దానికే డిఫరెంట్.. ఇక్కడ చూసేయండి మరి!

Silk Saree Movie: సీరియల్ నటుడు హీరోగా మూవీ.. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరీగా సిల్క్ శారీ

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

చంద్రకళ పేరుతో

తమిళంలో సూపర్ హిట్ కామెడీ హారర్ ఫ్రాంచైజీగాపేరు తెచ్చుకుంది అరణ్‌మనై సిరీస్. ఈ సిరీస్ నుంచి వస్తోన్న నాలుగో సినిమానే అరణ్‌మనై 4 (Aranmanai 4). ఈ ఫ్రాంచైజీని తెలుగులో ఇప్పటికే చంద్రకళ టైటిల్‌‌తో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇప్పుడు నాలుగో సినిమాను మాత్రం బాక్ టైటిల్‌తో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

స్వీయ దర్శకత్వంలో

బాక్ సినిమాకు తమిళ యాక్డర్ అండ్ డైరెక్టర్ సుందర్ సి స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా చేస్తున్నారు. వీరితోపాటు వెన్నెల కిశోర్, కోవై సరళ, ఢిల్లీ గణేష్, శ్రీనివాసులు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సైలెంట్‌గా వాయిదా

ఇదిలా ఉంటే బాక్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 26న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఇప్పుడు సైలెంట్‌గా సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు మేకర్స్. ఎండల తీవ్రత అధికంగా ఉండటం వలన విడుదల తేదిని వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. దాంతోపాటు బాక్ కొత్త విడుదల తేదిని కూడా తెలియజేశారు.

కొత్త రిలీజ్ డేట్

మే 3న బాక్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. దానికి సంబంధించి కొత్త పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో తమన్నా తీక్షణంగా చూస్తుంటే.. రాశీ ఖన్నా భయపడుతూ కనిపించింది. ఇక సుందర్ సి ఏదో ఆలోచిస్తూ కనిపించారు. బ్యాక్ గ్రౌండ్‌లో ఓ కోటను చూపిస్తూ ఇంటెన్సివ్‌గా పోస్టర్ ఉంది.

ఎండల కారణంగా

అయితే, ఎండలు అధికంగా ఉంటే ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. పిల్లలతో పాటు థియేటర్లలలోకి రాలేరు. కాబట్టి అలా జరిగితే సినిమాకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పంచుకో అనే పాట

కాగా బాక్ సినిమా నుంచి రీసెంట్‌గా పంచుకో అనే పాటను విడుదల చేశారు. ఇందులో తమన్నా, రాశీ ఖన్నా తమ గ్లామర్ అందాలతో ఆకట్టుకున్నారు. సినిమాలో భయపెడుతూనే హాట్ ట్రీట్ అందించనున్నట్లు హింట్ ఇచ్చేశారు. ముఖ్యంగా పాటలో తమన్నా, రాశీ ఖన్నా మూమెంట్స్ సిజ్లింగ్‌గా అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి.

తమిళంలో అచచో..

ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే, తెలుగులో పంచుకో అనే టైటిల్‌తో వచ్చిన ఈ పాట తమిళంలో మాత్రం అచచోగా విడుదలైంది. తమిళంలో పాట వింటే అయ్యయ్యో అనే అర్థంలో పదాన్ని వాడినట్లు తెలుస్తోంది. ఇక బాక్ సినిమా రిలీజ్‌కు ఎండ కష్టాలు రావడంతో అంతా అచచో అనుకుంటున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం