Jailer songs: జైలర్ సూపర్ హిట్ సాంగ్‍కు తెలుగు వెర్షన్ రిలీజ్.. తమిళంలో మూడో పాట ‘జుజుబీ’ వచ్చేసింది-jujubee third song released from jailer movie kavaalaa telugu version also out ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Jujubee Third Song Released From Jailer Movie Kavaalaa Telugu Version Also Out

Jailer songs: జైలర్ సూపర్ హిట్ సాంగ్‍కు తెలుగు వెర్షన్ రిలీజ్.. తమిళంలో మూడో పాట ‘జుజుబీ’ వచ్చేసింది

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 26, 2023 09:07 PM IST

Jailer songs: జైలర్ సినిమా నుండి మూడో పాట వచ్చేసింది. అలాగే, కావాలా సాంగ్‍కు తెలుగు వెర్షన్‍ను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

జైలర్ మూవీ పోస్టర్
జైలర్ మూవీ పోస్టర్

Jailer songs: తమిళ సూపర్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ మూవీపై నానాటికీ అంచనాలు పెరిగిపోతున్నాయి. తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులోనూ ఆగస్టు 10వ తేదీన విడుదల కానుంది. జైలర్ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహిస్తుండగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, నేడు (జూలై 26) జైలర్ మూవీ నుంచి ‘జుజూబీ’ అనే మూడో పాట తమిళంలో రిలీజ్ అయింది. అలాగే, తమిళంలో సూపర్ హిట్ అయిన ఫస్ట్ సాంగ్ ‘కావాలా’కు తెలుగు వెర్షన్ కూడా నేడు విడుదలైంది. వివరాలు ఇవే..

ట్రెండింగ్ వార్తలు

జైలర్ మూవీ నుంచి ఇటీవల తమిళంలో వచ్చిన ‘కావాలా’ అనే పాట సూపర్ పాపులర్ అయింది. ఈ పాట బీట్ ఉర్రూతలూగిస్తోంది. తమన్నా స్టెప్పులు అదిరిపోయాయి. రజినీ స్టైల్ ఆకట్టుకుంది. అయితే, నేడు ఈ పాటకు తెలుగు వెర్షన్ రిలీజ్ అయింది. తెలుగు లిరికల్ సాంగ్ ‘కావాలి’ పేరుతో వచ్చింది. తెలుగు పాటకు శ్రీసాయి కిరణ్ లిరిక్స్ అందించాడు. సింధూజ శ్రీనివాసన్, అనిరుధ్ రవిచంద్రన్ ఈ పాటను పాడారు. “రా దాచుంచా పరువాలన్నీ” అంటూ ఈ కావాలి పాట ప్రారంభమవుతుంది. చాలా క్యాచీ బీట్‍తో సాగింది. ఈ పాటకు తమన్నా డ్యాన్స్ హైలైట్‍గా ఉంది. తమిళంలో రిలీజ్ అయినప్పుడే కావాలా పాటలో తమన్నా డ్యాన్స్ చూసి ఇండియన్ షకీరా అంటూ చాలా మంది ప్రశంసలు కురిపించారు.

తమిళంలో మూడో పాట

జైలర్ నుంచి మూడో రిలికల్ సాంగ్ కూడా నేడు రిలీజ్ అయింది. జుజుబీ అంటూ ఈ పాట ఉంది. జైలర్ మూవీకి ఓ రకంగా ఇది థీమ్‍ పాటగా ఉండనుంది. జుజుబీ పాటను ధీ, అనిరుధ్ రవిచంద్రన్, అనంత కృష్ణన్ పాడారు. పవర్‌ఫుల్ బ్యాక్‍గ్రౌండ్‍తో ఈ సాంగ్ ఉంది. తమిళంలో ఈ సాంగ్‍ను సూపర్ సుబు రాశాడు.

జుజుబీ రిలికల్ సాంగ్‍లో రజినీ కాంత్ స్టైల్ నెక్స్ట్ లెవెల్‍లో ఉంది. పోస్టర్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. యాక్షన్ సీక్వెన్స్‌లో ఈ పాట ఉండే ఛాన్స్ ఉంది.

జైలర్ మూవీ నుంచి తమిళంలో ఇప్పటికే కావాలాతో పాటు హుకూం అనే పాట వచ్చింది. ఇప్పుడు జుజుబీ రిలీజ్ అయింది. త్వరలోనే మిగిలిన రెండు పాటలకు కూడా తెలుగు వెర్షన్ రావొచ్చు.

జైలర్ మూవీలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, సునీల్, రమ్యకృష్ణ, వినాయకన్, మిర్నా మీనన్, వసంత్ రవి, నాగబాబు, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జైలర్ సినిమా ఆగస్టు 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.