తెలుగు న్యూస్  /  Entertainment  /  Taapsee Pannu New Movie Dobara Ott Release On 15 October 2022

Dobaaraa OTT Release Date: తాప్సీ 'దొబారా' ఓటీటీ విడుదల తేదీ కన్ఫార్మ్.. ఎప్పుడు? ఎక్కడంటే?

01 October 2022, 22:30 IST

    • Dobaaraa on OTT: తాప్సీ నటించిన దొబారా చిత్రం ఆగస్టు 19న థియేటర్లలో విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 19న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
దొబారాలో తాప్సీ పన్ను
దొబారాలో తాప్సీ పన్ను (Twitter)

దొబారాలో తాప్సీ పన్ను

Dobaaraa OTT Release date: టాలీవుడ్‌లో ఝమ్మంది నాదం సినిమాతో అరంగేట్రం చేసిన తాప్సీ ఆనతి కాలంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం అడపా దడపా తెలుగతో పాటు కొన్ని దక్షిణాది చిత్రాల్లోనూ నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ. ఇటీవలే మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా శభాష్ మిత్తూ ఆనే బయోపిక్ తీశారు అనురాగ్ కశ్యప్. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఈ మధ్యలోనే మరో సరికొత్త సినితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే దొబారా. ఈ సినిమా ఆగస్టు 19న థియేటర్లలో విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Weekend OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలతో ఫుల్ టైంపాస్.. అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్

Aarambham: ఆ సినిమాలన్నీ ఓటీటీలోకే.. సస్పెన్స్, సైన్స్ ఫిక్షన్ అన్ని జోనర్లతో ఆరంభం: నటుడు రవీంద్ర విజయ్

Suhas: నా సినిమాలు మౌత్ టాక్‌తోనే వెళ్తాయి.. సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది.. సుహాస్ కామెంట్స్

Mahesh Babu: మ‌హేష్ బాబు రిజెక్ట్ చేసిన ల‌వ్ స్టోరీ థియేట‌ర్ల‌లో ఏడాది ఆడింది- ఆ సినిమా ఏదంటే?

స్టార్ హీరోయిన్ తాప్సీ ప్రస్తుతం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం దొబారా. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 19న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు ప్రణాలికను సిద్ధం చేశారు మేకర్స్. అక్టోబరు 15 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

యువతి చనిపోయిన ఓ అభ్బాయి ఆత్మతో మాట్లాడిన తర్వాత గతంలోకి వెళ్లి అతడి ప్రాణాలను ఎలా రక్షించిందన్నదే మిగిలిన కథ. 2018లో విడుదలైన మిరేగ్ అనే స్పానిష్ సినిమాకు ఇది రీమేక్. కల్ట్ మూవీస్, సునీల్ ఖేత్రాపాల్ అధీనా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. దాదాపు రూ.30 కోట్లోత నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు డిజాస్టర్‌గా నిలిచే అవకాశముంది. బాక్సాఫీస్ వద్ద ఆశీంచిన స్థాయిలో వసూళ్లు రాబట్టుకోలేకోయింది. ఫలితంగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి అనురాగ్ కశ్యప్ తెరకెక్కించారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.