తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suma Adda: సుమ గొంతు పట్టుకున్న గోపీచంద్.. వైరల్ అవుతున్న వీడియో

Suma Adda: సుమ గొంతు పట్టుకున్న గోపీచంద్.. వైరల్ అవుతున్న వీడియో

Hari Prasad S HT Telugu

24 April 2023, 20:22 IST

    • Suma Adda: సుమ గొంతు పట్టుకున్నాడు గోపీచంద్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. సుమ అడ్డా కార్యక్రమానికి వచ్చిన హీరో గోపీచంద్ సడెన్‌గా ఇలా చేయడంతో అందరూ షాక్ తిన్నారు.
యాంకర్ సుమ గొంతు పట్టుకున్న గోపీచంద్
యాంకర్ సుమ గొంతు పట్టుకున్న గోపీచంద్

యాంకర్ సుమ గొంతు పట్టుకున్న గోపీచంద్

Suma Adda: టాలీవుడ్‌లో విలన్ గా మొదలుపెట్టి హీరోగా ఎదిగిన వ్యక్తి గోపీచంద్. మాస్ సినిమాలు, పవర్‌ఫుల్ డైలాగులు ఎక్కువగా ఉండే అతని సినిమాల్లో అప్పుడప్పుడూ లవర్ బాయ్ క్యారెక్టర్ లోనూ కనిపిస్తాడు. తాజాగా రామ బాణం మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మధ్యే ట్రైలర్ రిలీజ్ కాగా.. దానికి మిశ్రమ స్పందన వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Kannappa: కన్నప్పలో ముగిసిన అక్షయ్ కుమార్ పార్ట్.. మిగిలింది ప్రభాస్? చాలా నేర్చుకున్నానంటూ మంచు విష్ణు

Krishna mukunda murari serial may 4th episode: మురారికి నిజం చెప్పేసిన మీరా.. ముకుంద, ఆదర్శ్ కి పెళ్లి చేద్దామన్న భవానీ

Guppedantha Manasu Serial: ఎండీ ప‌ద‌వికి వ‌సు రాజీనామా - రిషి ఫ్యామిలీ కోసం త్యాగం - ఎట్ట‌కేల‌కు నెర‌వేరిన శైలేంద్ర క‌ల

Brahmamudi May 4th Episode: బ్రహ్మముడి- రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ- నిజం రాబట్టిన కావ్య- అత్త దగ్గర కోటి కొట్టేసిన స్వప్న

రొటీన్ గోపీచంద్ సినిమాలాగే అనిపిస్తోందన్న కామెంట్స్ వచ్చాయి. అయితే ఇప్పుడీ రామ బాణం మూవీ టీమ్ ప్రమోషన్లలో బిజీ అయింది. ఇందులో భాగంగా ఈటీవీలో ప్రతి శనివారం వచ్చే సుమ అడ్డా కార్యక్రమానికి హీరో గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయాతి, కమెడియన్ గెటప్ శ్రీను వచ్చారు. ఎప్పటిలాగే సుమ తనదైన రీతిలో పంచ్ లు, నవ్వులతో ప్రోగ్రామ్ నడిపినట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది.

అయితే ఈ ప్రోమో చివర్లో గోపీచంద్.. సుమ గొంతు పట్టుకున్నట్లుగా చూపించారు. ఆ సీన్ తోనే ప్రోమో ముగించారు. దీంతో అసలు ఏం జరిగింది? సుమ గొంతును గోపీచంద్ ఎందుకు పట్టుకున్నాడన్నది సస్పెన్స్ గా వదిలేశారు. నిజానికి అతడు అలా సరదాగానే చేసినట్లు తెలుస్తూనే ఉంది. అయితే ఈ ఎపిసోడ్ పై ఆసక్తి పెంచడానికి ఇలా ప్రోమోను కట్ చేసి వదిలారు.

సాధారణంగా సుమా అడ్డాకు వచ్చే గెస్టులపై యాంకర్ సుమ పంచ్ లు వేస్తూ ఉంటుంది. అయితే ఈ ఎపిసోడ్ లో మాత్రం సుమపై కూడా బాగానే పంచ్ లు పడ్డాయి. సినిమాల్లో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా కనిపించే గోపీచంద్.. ఈ షోలో సరదాగా జోకులేస్తూ కనిపించాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.