తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Crime Thriller: డైరెక్ట్ ఓటీటీలోకి వస్తోన్న ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Crime Thriller: డైరెక్ట్ ఓటీటీలోకి వస్తోన్న ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu

24 December 2024, 6:32 IST

google News
    • Sub Inspector Yugandhar OTT Streaming: ఓటీటీలోకి డైరెక్ట్‌గా స్ట్రీమింగ్ కానున్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇన్‌స్పెక్టర్ యుగంధర్. ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని తాజాగా సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ద్వారా తెలుస్తోంది.
డైరెక్ట్ ఓటీటీలోకి వస్తోన్న ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
డైరెక్ట్ ఓటీటీలోకి వస్తోన్న ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? (Instagram/ETV Win OTT)

డైరెక్ట్ ఓటీటీలోకి వస్తోన్న ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sub Inspector Yugandhar OTT Release: విలక్షణ నటుడుగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు సాయి కుమార్. ఆయన కుమారుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆది సాయి కుమార్. ప్రేమ కావాలి సినిమాతో ఇండస్ట్రీలో మొదట సాలిడ్ హిట్ కొట్టాడు.

హిట్ కోసం

ప్రేమ కావాలి తర్వాత లవ్‌లీ, సుకుమారుడు, ప్యార్ మే పడిపోయానే, నెక్ట్స్ నువ్వే, రఫ్, చుట్టాలబ్బాయ్, తీస్ మార్ ఖాన్, శశి, క్రేజీ ఫెలో, జోడీ, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, బుర్రకథ వంటి అనేక సినిమాల్లో నటించాడు ఆది సాయి కుమార్. వాటిలో శశి, లవ్‌లీ మినహా మిగతావన్నీ పెద్ద హిట్ సాధించలేకపోయాయి. కాబట్టి, ఒక మంచి హిట్ కోసం పరితపిస్తున్నాడు ఆది సాయి కుమార్.

ఈ క్రమంలోనే తెలుగులో రెండు సినిమాలతో అలరించడానికి రెడీగా ఉన్నాడు ఆది సాయి కుమార్. ఆ రెండు మూవీసే శంభాల, సబ్‌ ఇన్‌స్పెక్టర్ యుగంధర్. వీటిలో సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. నవంబర్‌లో ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.

సందీప్ కిషన్ అతిథిగా

హీరో సందీప్ కిషన్ అతిథిగా హాజరై సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ మూవీ ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టాడు. ప్రస్తుతం ఇంకా ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోందని సమాచారం. అయితే, ఇంకా చిత్రీకరణ పూర్తి కానీ ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుందని సదరు ప్లాట్‌ఫామ్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలుస్తోంది.

ఆ ఓటీటీ ప్లాట్‌ఫామే ఈటీవీ విన్. డిెసంబర్ 23న ఆది సాయి కుమార్ బర్త్ డే సందర్భంగా ఓ పోస్టర్‌‍తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్. ఇందులో ఆది సాయి కుమార్ గన్ పట్టుకుని తీక్షణంగా చూస్తున్నట్లుగా ఉంది. హ్యాపీ బర్త్ డే ఆది సాయి కుమార్ అంటూ సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ మూవీ పోస్టర్‌ను ఈటీవీ ఓటీటీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

ఈటీవీ విన్ ఓటీటీలో

దీన్ని బట్టి ఈటీవీ విన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఇక సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ మూవీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కునుందని సమాచారం. ఇంకా షూటింగ్ పూర్తి కానీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ మూవీ గురించి థియేటర్‌లో రిలీజ్ కాకముందే ఈటీవీ విన్ బర్త్ డే విశెస్‌తో పోస్టర్ రిలీజ్ చేయడంతో నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

లేదా సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ ఓటీటీ రైట్స్‌ను ఈటీవీ విన్ ముందుగానే కొనుగోలు చేసినట్లు అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే, యశ్వంత్ దర్శకత్వం వహిస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ సినిమాకు ప్రణవ్ గిరిధరన్ సంగీతం అందించారు. రవీంద్రనాథ్ టి కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఓటీటీ రిలీజ్ డేట్

శ్రీ పినాక మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రదీప్ జూలురు నిర్మిస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ సినిమాలో ఆది సాయి కుమార్‌కు జోడీగా మేఘా లేఖా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో రాకేందు మౌళి, లావణ్య సాహుకార తదితరులు నటిస్తున్నారు. మరి సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నారని సమాచారం.

తదుపరి వ్యాసం