తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sonu Sood Reaction Fan Gift: రక్తంతో బొమ్మ గీసిన సోనూ సూద్ అభిమాని.. రక్తదానం చేయాలని నటుడి మనవి

Sonu Sood reaction fan Gift: రక్తంతో బొమ్మ గీసిన సోనూ సూద్ అభిమాని.. రక్తదానం చేయాలని నటుడి మనవి

09 September 2022, 22:49 IST

    • Sonu Sood paint with Blood: సోనూ మీద అభిమానంతో ఓ వ్యక్తి రక్తంతో బొమ్మను గీసి అతడికి బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు రక్తాన్ని వృథా చేయకుండా దానం చేయాలని సోనూసూద్ స్పష్టం చేశాడు.
సోనూ సూద్
సోనూ సూద్ (HT)

సోనూ సూద్

Sonu Sood reaction fan Gift: సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే వారందరూ నిజ జీవితంలోనూ ప్రతినాయకులుగానే ఉంటారనుకోవడం పొరపాటు. తన నటనతో సినిమాల్లో విలనిజంతో హీరోలకు చుక్కలు చూపించే సోనూ సూద్ మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. నటనతో పాటు సామాజిక సేవ చేస్తూ.. తనకంటూ ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్న వ్యక్తి. ఎంతలా అంటే తనను దేవుడిలా చూసుకునేంతగా అభిమానాన్ని చూరగొన్నాడు. అయితే ఇటీవల ఓ అభిమాని సోనూ సూద్ స్వచ్ఛంద సేవలకు మెచ్చి.. తన రక్తంతో సోనూ బొమ్మను తయారు చేసి అతడికి బహుమతిగా ఇచ్చాడు. అంతేకాకుండా సోనూ కోసం చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు.

ట్రెండింగ్ వార్తలు

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్ ఆకట్టుకుందా?

Romeo OTT Release Date: విజయ్ ఆంటోనీ ‘రోమియో’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటే..

Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

అభిమాని బహుమతికి ఆశ్చర్యం వ్యక్తం చేసిన సోనూ సూద్.. మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. రక్తంతో నా బొమ్మను గీయడం కంటే కూడా రక్తదానం చేసినట్లయితే ఇంకా సంతోషించేవాడినని అభిమానిని కోరాడు. ఈ విషయాన్ని సదరు నటుడే తన ట్విటర్ వేదికగా వీడియో రూపంలో తెలియజేశాడు.

"అతడు చాలా ప్రతిభావంతుడైన కళాకారుడు. నా పెయింట్ గీశాడు. కానీ ఇదే సమయంలో రక్తంతో నా బొమ్మను తయారు చేశావు. నువ్వు ఏదైతే చేశావో అది తప్పు. రక్తంతో నా బొమ్మ గీయాల్సిన అవసరం లేదు" అని సోనూ సూద్ అంటాడు. మీ కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తాను.. మీరు దేవుడి కంటే ఏ మాత్రం తక్కువ కాదు. అని సదరు అభిమాని బదులిస్తాడు. నీ అభిమానం నాకు అర్థమవుతుంది. కానీ రక్తంతో నా బొమ్మ గీసే కంటే కూడా.. రక్తాన్ని దానం చేస్తే బాగుండేది. అని చెప్పాడు. అయితే ఈ కళాకారుడిని అందరు సపోర్ట్ చేయాలని, అతడు అనుకున్నవి అన్నీ సాధించాలని సోనూ సూద్ వీడియోలో కోరుకున్నాడు.

సోనూ సూద్ బొమ్మను రక్తంతో గీసిన ఆ కళాకారుడు పేరు మధు గుర్జార్. సోనూ మీద అభిమానంతో రక్తంతో బొమ్మను గీసి అతడికి బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు రక్తాన్ని వృథా చేయకుండా దానం చేయాలని సోనూసూద్ స్పష్టం చేశాడు.

సోనూ సూద్ చివరగా అక్షయ్ కుమార్ నటించిన చాంద్ బార్దాయ్ అనే చిత్రంలో నటించాడు. సోనూ తర్వాత తమిళంలో తమిళరాసన్ అనే సినిమా చేస్తున్నాడు. ఇది కాకుండా బాలీవుడ్ ఫిల్మ్ ఫతే అనే సినిమాలో లీడ్ రోల్‌లో నటించనున్నాడు. దీనికి అభినందన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.