తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pathaan First Day Collection: ప‌ఠాన్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - కేజీఎఫ్ -2ను బీట్ చేయ‌లేక‌పోయిన షారుఖ్ సినిమా

Pathaan First Day Collection: ప‌ఠాన్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - కేజీఎఫ్ -2ను బీట్ చేయ‌లేక‌పోయిన షారుఖ్ సినిమా

26 January 2023, 11:38 IST

  • Pathaan First Day Collection: షారుఖ్‌ఖాన్ ప‌ఠాన్ సినిమా తొలిరోజు 51 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. బాలీవుడ్‌లో ఫ‌స్ట్ డే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

షారుఖ్‌ఖాన్
షారుఖ్‌ఖాన్

షారుఖ్‌ఖాన్

Pathaan First Day Collection: షారుఖ్‌ఖాన్ ప‌ఠాన్ మూవీ ఫ‌స్ట్ డే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బుధ‌వారం రోజు ఈ సినిమా 51 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. తొలిరోజు హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన బాలీవుడ్‌ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. గ‌తంలో హృతిక్ రోష‌న్‌, టైగ‌ర్ ష్రాఫ్ హీరోలుగా న‌టించిన వార్ సినిమా 53.3 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

ట్రెండింగ్ వార్తలు

Prithviraj Sukumaran: ‘సలార్’పై ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన పృథ్విరాజ్ సుకుమారన్.. ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్

Janhvi Kapoor: తిరుపతిలో పహారియాతో జాన్వీ కపూర్ పెళ్లి అంటూ రూమర్.. స్పందించిన హీరోయిన్

Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్

Netflix OTT top movies: నెట్‍ఫ్లిక్స్‌లో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ మూవీ

అలాగే య‌శ్ కేజీఎఫ్ -2 హిందీ వెర్ష‌న్ అత్య‌ధికంగా 53. 9 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. అమీర్‌ఖాన్ థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్ టాక్‌తో సంబంధం లేకుండా 52 కోట్లు క‌లెక్ట్ చేసింది. వాటి త‌ర్వాత స్థానంలో హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్ రాబ‌ట్టిన‌ సినిమాగా ప‌ఠాన్ నిలిచింది.

క‌లెక్ష‌న్స్ ప‌రంగా కేజీఎఫ్ -2ను ప‌ఠాన్ బీట్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. క‌థ విష‌యంలో మిక్స‌డ్ టాక్ రావ‌డంతో య‌శ్ రికార్డ్‌ను షారుఖ్ సినిమా బ్రేక్ చేయ‌లేక‌పోయింది. గురువారం ప‌బ్లిక్ హాలీడే ఉండ‌టంతో ఈ సినిమా క‌లెక్ష‌న్స్ తొలిరోజు పోలిస్తే మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

గురువారం క‌లెక్ష‌న్స్‌తో ప‌ఠాన్ వంద కోట్లు ఈజీగా దాటుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో ఇండియ‌న్ రా ఏజెంట్ ప‌ఠాన్‌గా షారుఖ్‌ఖాన్ న‌టించ‌గా ఐఎస్ఐ ఏజెంట్ పాత్ర‌లో దీపికా ప‌డుకోణ్ క‌నిపించింది. భార‌త‌దేశంపై దాడికి ప్లాన్ చేసిన ఓ ప్రైవేట్ ఏజెంట్ ప్లాన్‌ను ప‌ఠాన్ ఎలా ఎదుర్కొన్నాడ‌న్న‌దే ఈ సినిమా ఇతివృత్తం.

క‌థ కంటే యాక్ష‌న్ అంశాల‌కే అధికంగా ప్రాముఖ్య‌త‌నిస్తూ ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. ప‌ఠాన్ సినిమాలో స‌ల్మాన్‌ఖాన్ అతిథి పాత్ర‌లో న‌టించాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.