తెలుగు న్యూస్  /  Entertainment  /  Shahrukh Khan Blue Wrist Watch Cost Around 4.7 Crores It's More Than A Small Movie Budget

Shahrukh Khan Watch Cost: షారుఖ్ ఖాన్ వాచ్ ధ‌ర వింటే షాక్ అవ్వాల్సిందే

10 February 2023, 17:07 IST

  • Shahrukh Khan Watch Cost:  ప‌ఠాన్ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో షారుఖ్‌ఖాన్ ధ‌రించిన ఓ వాచ్ ధ‌ర బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వాచ్ ధ‌ర ఎంతంటే...

Shahrukh Khan
Shahrukh Khan

Shahrukh Khan

Shahrukh Khan Watch Cost: ప‌ఠాన్ సినిమాతో నాలుగేళ్ల త‌ర్వాత బాలీవుడ్‌లోకి అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చాడు స్టార్ హీరో షారుఖ్‌ఖాన్‌. స్పై యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా ప‌ద‌హారు రోజుల్లో 887 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఇండియా వైడ్‌గా హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన బాలీవుడ్ సినిమాగా షారుఖ్‌ఖాన్ ప‌ఠాన్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Kareena Kapoor Toxic: యశ్ టాక్సిక్ నుంచి తప్పుకున్న కరీనా కపూర్.. కారణం అదేనా?

Bharti Singh Hospitalised: హాస్పిటల్లో చేరిన ప్రముఖ కమెడియన్.. కంటతడి పెడుతూ వీడియో

Salaar TRP: ప్రభాస్ సలార్ మూవీకి టీవీలో దారుణమైన టీఆర్పీ.. ఆ రెండు సినిమాల కంటే తక్కువే.. కారణం ఇదేనా?

Kamal Haasan Linguswamy: కమల్ హాసన్ మోసం చేశాడు: నిర్మాతల మండలికి డైరెక్టర్ ఫిర్యాదు

కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్‌లో షారుఖ్‌ఖాన్ బ్లూ క‌ల‌ర్ వాచ్ ధ‌రించి హాజ‌ర‌య్యాడు. అలాగే శుక్ర‌వారం దీపికా ప‌డుకోణ్ షేర్ చేసిన ప‌ఠాన్ ప్ర‌మోష‌న్స్‌కు సంబంధించిన వీడియోలోనూ షారుఖ్‌ఖాన్ ఇదే బ్లూ క‌ల‌ర్ వాచ్ ధ‌రించి క‌నిపించ‌డం అభిమానుల‌ను ఆక‌ట్టుకున్న‌ది. షారుఖ్ వాచ్ ఫొటోను ప‌లువురు నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

షారుఖ్‌ఖాన్ ధ‌రించిన ఈ వాచ్ ధ‌ర దాదాపు 4.7 కోట్లు ఉంటుంద‌ని స‌మాచారం. అడెమ‌ర్స్ పిగెట్ అనే బ్రాండ్‌కు చెందిన వాచ్ ఇద‌ని తెలిపింది. రాయ‌ల్ ఓక్ అనే మోడ‌ల్‌కు చెందిన ఈ వాచ్‌ ధ‌ర 4. 7 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని తెలిసింది. ఈ వాచ్ ధ‌ర సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వాచ్ ధ‌ర‌తో జీవితాంతం ల‌గ్జ‌రీగా బ‌త‌క‌వ‌చ్చు...ఈ వాచ్ కొనే ధ‌ర‌తో చిన్న సినిమా చేయ‌వ‌చ్చు అంటూ నెటిజ‌న్లు ఫ‌న్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ప‌ఠాన్ స‌క్సెస్‌తో జోష్ మీదున్న షారుఖ్‌ఖాన్ ప్ర‌స్తుతం జ‌వాన్‌తో పాటు డుంకీ సినిమాల‌పై దృష్టిసారించాడు. జ‌వాన్ సినిమాకు అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోన్న జ‌వాన్ జూన్ 2న రిలీజ్ కానుంది. డుంకీ సినిమాకు రాజ్‌కుమార్ హిరాణీ డైరెక్ట‌ర్‌.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.