తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shahid Kapoor House : స్టార్ హీరోకు రూ.7లక్షల ఇంటి అద్దె కడుతున్న మరో స్టార్ హీరో

Shahid Kapoor House : స్టార్ హీరోకు రూ.7లక్షల ఇంటి అద్దె కడుతున్న మరో స్టార్ హీరో

Anand Sai HT Telugu

20 January 2023, 10:13 IST

    • Kartik Aaryan Rented House : కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా మారాడు. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన నటించిన 'భూల్‌ భూలయ్య 2' సూపర్‌ హిట్‌ అయింది. ఈ సినిమాతో అతడి డిమాండ్ పెరిగింది.
షాహిద్ కపూర్, కార్తీక్ ఆర్యన్
షాహిద్ కపూర్, కార్తీక్ ఆర్యన్

షాహిద్ కపూర్, కార్తీక్ ఆర్యన్

స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్(Karthik Aaryan).. ఇటీవల ముంబైలో ఇంటి కోసం వెతికాడు. ఇక ఇల్లు చూడటం అయిపోయింది. కార్తీక్ ఆర్యన్‌కి జుహులో అపార్ట్‌మెంట్ నచ్చింది. అయితే అది ఎవరిదో కాదు.. మరో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్(Shahid Kapoor) ఇల్లే. దీంతో కార్తీక్ ఆర్యన్ ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. షాహిద్ కపూర్ గత సెప్టెంబర్ వరకు ఈ ఇంట్లోనే నివసించాడు. ఇప్పుడు బాంద్రా సమీపంలోని కొత్త ఇంటికి మారాడు. అందువల్ల జుహు ఇల్లు ఖాళీగా ఉంది. దీనిని కార్తీక్ ఆర్యన్ అద్దెకు తీసుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

Kannappa Prabhas: కన్నప్ప షూటింగ్‌లో ప్రభాస్.. ఆ మూడు రోజుల్లోనే పూర్తి చేయాలంటూ..

Koratala Siva on Devara: నాకు, అభిమానులకు స్పెషల్ సినిమా: దేవరపై దర్శకుడు కొరటాల శివ.. అప్‍డేట్లపై కామెంట్

కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్(Bollywood)లో సక్సెస్ ఫుల్ హీరోగా మారాడు. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన నటించిన 'భూల్‌ భూలయ్య 2'(Bhool Bhulaiyaa 2) సూపర్‌ హిట్‌ అయింది. ఈ సినిమాతో అతని డిమాండ్ పెరిగింది. అతనికి చాలా ఆఫర్లు వస్తున్నాయి. రీసెంట్ గా కార్తీక్ ఆర్యన్ ఇల్లు మారాలి అనుకున్నాడు. ఇప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చేశాడు.

జుహులోని షాహిద్ కపూర్ ఇంటికి కార్తీక్ ఆర్యన్ నెలకు రూ.7.5 లక్షలు చెల్లిస్తున్నాడు. ఇల్లు 3,681 చదరపు అడుగులు. ప్రతి సంవత్సరం అద్దె ఏడు శాతం పెరుగుతుంది. అంటే 2024లో కార్తీక్ ఆర్యన్ ప్రతి నెలా రూ.8.02 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.45 లక్షలు చెల్లించాడు.

కార్తీక్ ఆర్యన్ చాలా కాలం జుహులోనే ఉన్నాడు. అతను తన తల్లిదండ్రులు, సోదరితో నివసించాడు. చాలా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఆయన నటించిన 'ఫ్రెడ్డీ' చిత్రం OTTలో విడుదలై ప్రశంసలు అందుకుంది. 'షెహజాదా' చిత్రం ఫిబ్రవరి 10న విడుదలవుతోంది. తెలుగులో వచ్చిన ‘అల వైకుంట పురంలో’ చిత్రానికి ఇది రీమేక్. 'ఆషికీ 3' చిత్రానికి కూడా కార్తీక్‌ హీరో.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.