తెలుగు న్యూస్  /  Entertainment  /  Shah Rukh Khan Pathaan Overcome 700 Crore Mark In Just 9 Days

Pathaan Movie Collections: పఠాన్ అరుదైన ఘనత.. 9 రోజుల్లోనే రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లు

03 February 2023, 22:28 IST

    • Pathaan Movie Collections: షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ చిత్రం విడుదలైన 9 రోజుల్లోనే 700 కోట్ల మార్కును అధిగమించింది. అంతేకాకుండా ఓవర్సీస్‌లోనూ దుమ్మురేపింది.
పఠాన్ వసూళ్ల వర్షం
పఠాన్ వసూళ్ల వర్షం (HT_PRINT)

పఠాన్ వసూళ్ల వర్షం

Pathaan Movie Collections: కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత షారుఖ్ నటించిన సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ విపరీతంగా వస్తోంది. దీపికా పదుకుణె, జాన్ అబ్రహం కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. తాజాగా రూ.700 కోట్ల మార్కును అందుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Tollywood: ఆ ఒక్కటి అడక్కు, ప్రసన్న వదనం సినిమాల రన్‍టైమ్ ఇదే.. క్రిస్ప్‌గా అల్లరి నరేశ్ మూవీ

Bollywood Khans movie: మేం ముగ్గురం కలిసి సినిమా చేయబోతున్నాం: ఖాన్ త్రయం మూవీపై ఆమిర్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‍ను నిరూపిస్తున్న ఫ్యామిలీస్టార్!

Most Watched Telugu Web Series: జీ5 ఓటీటీలో ఎక్కువ మంది చూసిన తెలుగు క్రైమ్ వెబ్ సిరీస్ ఇవే

పఠాన్ చిత్రం విడుదలైన 9 రోజుల్లోనే రూ.700 కోట్ల మార్కును అధిగమించింది. దేశవాళీతో పాటు ఓవర్సీస్‌లో మెరుగైన కలెక్షన్లను సాధించిన ఈ సినిమా అదిరగొట్టింది. 9వ రోజున ఈ సినిమా భారత్‌లో హిందీ వెర్షన్‌కే 15.65 కోట్ల వసూళ్లు వచ్చాయి. డబ్బింగ్ వెర్షన్‌లో ఈ చిత్రం రూ.65 లక్షలు రాబట్టింది.

ఓవర్సీస్‌లో ఈ సినిమా రూ.259.6 కోట్ల వసూలు చేయగా.. భారత్‌లో రూ,351 కోట్లను వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కేవలం 9 రోజుల్లోనే ఇంత భారీ వసూళ్లను సాధించడం విశేషం. త్వరలోనే వెయ్యి కోట్ల మార్కును అందుకునే దిశగా దూసుకెళ్తోంది.

ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ కూడా అరుదైన ఘనత సాధించాడు. రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన 5 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక హిందీ దర్శకుడిగా సిద్ధార్థ్ ఘనత సాధించాడు. అలాగే ఐదు వంద కోట్ల మార్కును అందుకున్న దర్శకుడిగానూ ఘనత సాధించాడు.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ విడుదల కానుంది. దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాలో జాన్ అబ్రహం కీలక పాత్ర పోషించారు. విశాల్-శేఖర్ సంగీత దర్శకత్వం వహించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.